Stock Market Today: అదానీ గ్రూప్ షేర్ల కొనుగోళ్లు పుంజుకోవడం, ఐటీ షేర్లు, రిలయన్స్ షేర్లు జోరుతో స్టాక్ మార్కెట్ స్పీడ్ అందుకుంది. రెండు రోజులుగా డల్‌గా సాగుతున్న మార్కెట్‌లో కొత్త జోష్ నింపాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్ బలమైన ర్యాలీని చూస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 1500 పాయింట్లకుపైగా పెరిగి 79,000 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ మళ్లీ 79000 ని టచ్ చేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా పెరుగుదలను చూస్తోంది. నిఫ్టీ50 ఇండెక్స్ 500 పాయింట్లకుపైగా జంప్‌తో 23,800 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.


సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 28 షేర్లు సూపర్ 
సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 28 స్టాక్‌లు లాభాలతో ట్రేడవుతుండగా, 2 మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 48 లాభాలతో, 2 నష్టాలతో ట్రేడవుతున్నాయి. SBI 4.27%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.67%, బజాజ్ ఫైనాన్స్ 2.65%, టైటాన్ 2.45%, HCL టెక్ 2.40%, ITC 2.37%, భారతీ ఎయిర్‌టెల్ 2.23% లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ 0.25%, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.20% క్షీణతతో ట్రేడవుతున్నాయి.


మళ్లీ దూసుకెళ్లిన అదానీ షేర్లు 
భారీగా పతనమైన అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ రీ బౌన్స్ అయ్యాయి. ఏసీసీ 3.81 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.40 శాతం, అదానీ పోర్ట్స్ 2.54 శాతం, అంబుజా సిమెంట్ 3.60 శాతం వృద్ధితో ట్రేడవుతున్నాయి.


ఇన్వెస్టర్ల సంపద రూ.5.50 లక్షల కోట్లు పెరుగుదల
స్టాక్ మార్కెట్ పెరుగుదల కారణంగా పెట్టుబడిదారుల సంపదలో భారీ హైక్ వచ్చింది. బిఎస్‌ఇలో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లో రూ.425.38 లక్షల కోట్లు ఉన్న సంపద రూ.430.98 లక్షల కోట్లకు చేరుకుంది. నేటి సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపదలో రూ.5.60 లక్షల కోట్లు పెరుగుదల కనిపించింది. 


నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ ఐటీ, ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్, రియల్ ఎస్టేట్, ఇంధనం, ఇన్‌ఫ్రా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు కూడా లాభపడ్డాయి.