Niti Aayog: 


వ్యవసాయ రంగంలో భారీ మార్పులు రావాల్సి ఉందని నీతి ఆయోగ్‌ తెలిపింది. ప్రభుత్వ నియంత్రణ, నిబంధనలను సరళీకరించాలని సూచించింది. అప్పుడే రైతుల ఆదాయం పెరుగుతుందని వెల్లడించింది.


'సైన్స్‌ ఆధారిత టెక్నాలజీ, సాగుబడికి ముందు, పంట కోతల తర్వాత ప్రైవేటు రంగ భాగస్వామ్యం, ఉత్పత్తి మార్కెట్లలో సరళీకరణ, చురుకైన భూమి లీజు మార్కెట్‌, రైతుల సామర్థ్యం పెంపు, ఆధునిక పనిముట్ల మోహరింపు వల్లనే 21వ శతాబ్దపు సవాళ్లను వ్యవసాయ రంగం తీరుస్తుంది. అప్పుడే వికసిత భారత్‌ లక్ష్యం నెరవేరుతుంది' అని నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్ చంద్‌ తన వర్కింగ్‌ పేపర్‌లో ప్రచురించారు. ఆయోగుకు కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న జస్పాల్‌ సింగ్‌ సహ రచయితగా ఉన్నారు.


నియంత్రణలను సరళీకరించడం, ప్రభుత్వ - ప్రైవేటు పెట్టుబడులను సులభతరం చేయడం ద్వారానే వ్యవసాయ రంగం స్వేచ్ఛ పొందుతుందని వర్కింగ్‌ పేపర్‌ నొక్కి చెప్పింది. 'సులభతర విధానాలతోనే వ్యవసాయరంగంలో విజ్ఞానం, ప్రతిభ ఆధారిత పనివిధానాలు పెరుగుతాయి. ప్రైవేటు, కార్పొరేటు పెట్టుబడులు, సరికొత్త ఉత్పత్తిదారులు, సంయుక్త ఆహార వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. వినియోగదారులు, ఉత్పత్తి దారుల మధ్య అనుసంధానం జరగాలి. అప్పుడు ఈ రంగంలో ఆధునికీకరణ సాధ్యమవుతుంది' అని వెల్లడించింది.


సామర్థ్యాన్ని గుర్తించ లేకపోవడమే వ్యవసాయ రంగంలో అతిపెద్ద సమస్యగా మారిందని వర్కింగ్‌ పేపర్లో పేర్కొన్నారు. సాధారణ వృద్ధి నుంచి సమర్థవంతమైన వృద్ధి వైపు పయనించాలని సూచించింది. అప్పుడే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని వెల్లడించింది. ఇది జరగాలంటే వ్యవసాయ రంగంలో సరికొత్త టెక్నాలజీని మోహరించాలంది. స్మార్ట్‌ ఫార్మింగ్‌, ప్రధాన - ఉప ఉత్పత్తులను గరిష్ఠ స్థాయిలకు చేర్చాలంది.


వికసిత భారతం కావాలంటే వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందని నీతి ఆయోగ్‌ వివరించింది. సమ్మిళిత అభివృద్ధి, వ్యవసాయ వృద్ధి, ఉపాధి కల్పన ముఖ్యమని తెలిపింది. ఐక్య రాజ్య సమితి చెప్పిన సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అజెండా -2030 సాధించాలంటే  వ్యవసాయ రంగంలో మార్పులు రావాలంది. అందులో 11-17 లక్షాలు నేరుగా వ్యవసాయంతో సంబంధం ఉన్నవేనని తెలిపింది.


వ్యవసాయదారులకు కనీస మద్దతు ధరను అందించేందుకు రెండు వ్యవస్థలను ఆధారం చేసుకోవాలని నీతి ఆయోగ్‌ తెలిపింది. ధాన్యం సేకరణ, ధరల అంతరాన్ని పూడ్చే చెల్లింపులు ద్వారా ఈ పని చేయాలంది. 


Also Read: TDS కట్‌ కాని పోస్టాఫీస్‌ స్కీమ్స్‌ కొన్ని ఉన్నాయి, ఫుల్‌ అమౌంట్‌ మీ చేతికొస్తుంది


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial