NEET 2022 OYO offers Special Discount For Woman Aspirants : నీట్‌ పరీక్షకు సిద్ధమయ్యారా? మీ ఊరికి దూరంగా మరో పట్టణంలో సెంటర్‌ పడిందా? ముందురోజు వెళ్లి అక్కడ ఎవరింట్లో ఉండాలని దిగులు పడుతున్నారా? అస్సలు అవసరం లేదంటోంది ఓయో! దేశ వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌లోని ఏ హోటల్లో దిగినా 60 శాతం రాయితీ ఇస్తామంటోంది!


మెడిసిన్‌ చదవాలనుకొనే వారికి నీట్‌ పరీక్ష ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే! ఈ నెల 17న, ఆదివారం దేశవ్యాప్తంగా 497 నగరాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. 18 లక్షలకు పైగా అభ్యర్థులు దీనికి హాజరవుతున్నారు. అయితే చాలామందికి సెంటర్లు వేరే పట్టణాలు, నగరాల్లో పడ్డాయి. ఒకరోజు ముందే అక్కడికి వెళ్లి బస చేయడం కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా అమ్మాయిలు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు.


మహిళా అభ్యర్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకొన్న ఓయో ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. జులై 16, 17 తేదీలో తమ నెట్‌వర్క్‌ పరిధిలోని హోటళ్లలో బస చేస్తే 60 శాతం రాయితీ ఇస్తోంది. పరీక్ష కేంద్రాలకు సమీపంలోని హోటళ్లలో ఉచిత వైఫై, ఎయిర్‌ కండీషనింగ్‌ సౌకర్యాలను ఉచితంగా అందిస్తోంది.


ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలంటే ముందుగా ఓయో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అందులో 'నియర్‌ బై' అనే ఐకాన్‌పై కిక్‌ చేయాలి. మీ పరీక్షా కేంద్రం సమీపలోని హోటల్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత 'NEETJF' అనే కూపన్‌ ఎంటర్‌ చేసి బుక్‌ నౌ మీద క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత 'పే ఎట్‌ హోటల్‌' బటన్‌ క్లిక్‌ చేస్తే సరిపోతుంది.


NEET Admit Card 2022 ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి:


మొదట ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in/ ను ఓపెన్‌ చేయాలి
NEET UG 2022 అడ్మిట్ కార్డ్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి
అప్లికేషన్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి
నీట్-2022 అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది
డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవచ్చు.


నీట్‌ పరీక్ష 13 భాషల్లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష వ్యవధి మూడు గంటల 20 నిమిషాలు. మొత్తం 200 ప్రశ్నలకు నీట్ పరీక్ష ఉంటుంది. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానాలకు 1 మార్కు కోత ఉంటుంది. ఈ విషయాన్ని  గుర్తు పెట్టుకుని తెలిసిన ఆన్సర్లు మాత్రమే టిక్ చెస్తే ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది.