Stock market news: అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన యూఎస్‌ ఫెడ్‌, తన వడ్డీ రేట్లను ఎంత మేర పెంచుతుందోనన్న భయం ప్రపంచ మార్కెట్లలో కనిపిస్తోంది. అయితే, ఇండియన్‌ ఈక్విటీస్‌ మీద మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో, నాలుగు స్టాక్స్‌ మీద కవరేజ్‌ ప్రారంభించిన నాలుగు బ్రోకింగ్‌ హౌస్‌లు, యూఎస్‌ ఫెడ్‌ రేట్లతో సంబంధం లేకుండా ఆ 4 షేర్లు దూసుకెళ్లగలవని అంచనా వేశాయి. వాటికి బయ్‌ రేటింగ్‌ ఇస్తూ, ప్రస్తుత స్థాయి నుంచి 10-38 శాతం వరకు ఇవి ర్యాలీ చేయగలవని చెబుతున్నాయి.


స్క్రిప్‌: సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ‍(City Union Bank‌)
బ్రోకరేజ్‌: ఐడీబీఐ క్యాపిటల్‌ (IDBI Capital)
ప్రైస్‌ టార్గెట్‌ : రూ.230
సోమవారం నాటి ముగింపు ధర: రూ.180.55
ఇక్కడి నుంచి వృద్ధి చెందగల అవకాశం: 27.4 శాతం
సిటీ యూనియన్ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఆకర్షణీయమైన వాల్యుయేషన్‌లో ఉందని చెబుతూ, IDBI క్యాపిటల్ ఈ స్టాక్‌ మీద 'బయ్‌' రేటింగ్‌తో కవరేజీని ప్రారంభించింది. 


స్క్రిప్‌: ఎథోస్‌ (Ethos)
బ్రోకరేజ్‌: ఎంకే గ్లోబల్‌ (Emkay Global)
ప్రైస్‌ టార్గెట్‌ : రూ.1,400
సోమవారం నాటి ముగింపు ధర: రూ.1,016
ఇక్కడి నుంచి వృద్ధి చెందగల అవకాశం: 37.8 శాతం
ఎంకే వృద్ధి అవకాశాలను ఉటంకిస్తూ కొనుగోలు రేటింగ్‌తో లగ్జరీ వాచ్ రిటైలర్‌పై కవరేజీని ప్రారంభించింది. 
భారత్‌లో లగ్జరీ వాచ్‌ల అమ్మకాలు విపరీతమైన వృద్ధిలో ఉన్నాయని, ఎథోస్‌కు దేశవ్యాప్తంగా ఉన్న భౌతిక ఉనికి (17 నగరాల్లో 50 స్టోర్లు) & బలమైన ఆన్‌లైన్ ప్రెజెన్స్‌ ప్రకారం 15% మార్కెట్ వాటాను కలిగి ఉందని బ్రోకరేజ్ తెలిపింది.


స్క్రిప్‌: అంబుజా సిమెంట్స్‌ (Ambuja Cements)
బ్రోకరేజ్‌: ఇన్వెస్టిక్‌ (Investec)
ప్రైస్‌ టార్గెట్‌ : రూ.752
సోమవారం నాటి ముగింపు ధర: రూ.564.50
ఇక్కడి నుంచి వృద్ధి చెందగల అవకాశం: 33.3 శాతం
కంపెనీ కోసం రూ.20,000 కోట్లను ప్రిఫరెన్షియల్ ఇష్యూ (వారెంట్లు) ద్వారా సమీకరించేందుకు కొత్త ప్రమోటర్‌ అదానీ గ్రూప్‌ నిర్ణయించడంతో, బ్రోకరేజ్‌ ఇన్వెస్టెక్ ఈ స్టాక్‌పై మీద గతంలో ఇచ్చిన రూ.432 లక్ష్యాన్ని ఇప్పుడు రూ.752కి పెంచింది.


స్క్రిప్‌: క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌/మెట్రో షూస్‌ (Campus Activewear/Metro Shoes)
బ్రోకరేజ్‌: మోతీలాల్‌ ఓస్వాల్‌ (Motilal Oswal)
ప్రైస్‌ టార్గెట్‌ : రూ.640, ఆ తర్వాత రూ.1,000
సోమవారం నాటి ముగింపు ధర: రూ.581
ఇక్కడి నుంచి వృద్ధి చెందగల అవకాశం: 10.15 శాతం, ఆ తర్వాత 22 శాతం
ఈ బ్రోకరేజ్ క్యాంపస్‌ యాక్టివ్‌వేర్‌ మీద బయ్‌ రేటింగ్‌తో కవరేజీని ప్రారంభించింది. రాబోయే రెండేళ్లలో కంపెనీకి మరింత వృద్ధి అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజ్‌ మోతీలాల్‌ ఓస్వాల్‌ లెక్కగట్టింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.