Stock Market Closing Bell 15 June 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) బుధవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీలు ఆద్యంతం ఒడుదొడుకుల మధ్యే సాగుతున్నాయి. అంతర్జాతీయంగా నెగెటివ్ సంకేతాలే వస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 39 పాయింట్ల నష్టంతో 15,692, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 152 పాయింట్ల నష్టంతో 52,541 వద్ద ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్ షేర్లకు డిమాండ్ కనిపించింది.
BSE Sensex
క్రితం సెషన్లో 52,693 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 52,650 వద్ద స్వల్ప నష్టాల్లో మొదలైంది. 52,493 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,867 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 152 పాయింట్ల నష్టంతో 52,541 వద్ద ముగిసింది. ఆద్యంత రేంజ్ బౌండ్‌లో కదలాడిన సూచీ మధ్యాహ్నం 150 పాయింట్ల మేర లాభాల్లోకి వెళ్లింది.
NSE Nifty
మంగళవారం 15,732 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 15,729 వద్ద ఓపెనైంది. 15,678 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,783 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 39 పాయింట్ల నష్టంతో 15,692 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప లాభాల్లో ముగిసింది. ఉదయం 33,317 వద్ద మొదలైంది. 33,249 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,554 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఒకానొక దశలో 180 పాయింట్ల లాభంతో ఉన్న సూచీ చివరికి 27 పాయింట్ల లాభంతో 33,339 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ముగిశాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హీరో మోటో, గ్రాసిమ్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఇన్ఫీ, రిలయన్స్, విప్రో షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ, మెటల్, మీడియా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఫార్మా షేర్లకు గిరాకీ ఉంది.