Stock Market Closing Bell 01 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం ఎరుపెక్కాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో మదుపర్లు భారీగా అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 216 పాయింట్ల నష్టంతో 17,542 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 770 పాయింట్ల నష్టంతో 58,766 వద్ద ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజే రూ.3 లక్షల కోట్లు తగ్గిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 10 పైసలు పడిపోయి 79.55 వద్ద ముగిసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 59,537 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,710 వద్ద గ్యాప్‌డౌన్‌తో  మొదలైంది. 58,522 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,309 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 770 పాయింట్ల నష్టంతో 58,766 వద్ద ముగిసింది.


NSE Nifty


మంగళవారం 17,759 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,485 వద్ద ఓపెనైంది. 17,468 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,695 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 216 పాయింట్ల నష్టంతో 17,542 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ నష్టాల్లో ముగిసింది.  ఉదయం 38,806 వద్ద మొదలైంది. 38,803 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,667 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 235 పాయింట్ల నష్టంతో 39,301 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ముగిశాయి. టాటా కన్జూమర్‌, బజాజ ఫిన్‌సర్వ్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఐచర్‌ మోటార్స్‌, హీరోమోటోకార్ప్‌ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, రిలయన్స్‌, ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, రియాల్టీ సూచీలు స్వల్పంగా ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.