Stock Market Closing Bell 19 July 2022: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 80 మార్క్‌ను టచ్ చేసినా మదుపర్లు ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 49 పాయింట్ల లాభంతో 16,328, బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 246 పాయింట్ల లాభంతో 54,764 వద్ద ముగిశాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 54,521 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 54,251 వద్ద లాభాల్లో మొదలైంది. 54,232 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,817 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 246 పాయింట్ల లాభంతో 54,767 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 16,278 వద్ద ముగిసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ మంగళవారం 16,187 వద్ద ఓపెనైంది. 16,187 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,359 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 49 పాయింట్ల లాభంతో 16,328 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ముగిసింది. ఉదయం 35,113 వద్ద మొదలైంది. 35,110 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,761 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 361 పాయింట్ల లాభంతో 35,720 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, టాటా కన్జూమర్ షేర్లు నష్టపోయాయి. మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, రియాల్టీ, మెటల్ సూచీలు ఎగిశాయి.