Stock Market Opening Bell 19 July 2022: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నా మదుపర్లు సెంటిమెంటుతో కొనుగోళ్లు చేపడుతున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 30 పాయింట్ల లాభంతో 16,308, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 112 పాయింట్ల లాభంతో 54,632 వద్ద ఉన్నాయి. చరిత్రలో తొలిసారి రూపాయి 80 మార్కును దాటేసింది.
BSE Sensex
క్రితం సెషన్లో 54,521 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 54,251 వద్ద లాభాల్లో మొదలైంది. 54,232 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,619 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 112 పాయింట్ల లాభంతో 54,632 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
సోమవారం 16,278 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,187 వద్ద ఓపెనైంది. 16,187 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,310 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 30 పాయింట్ల లాభంతో 16,308 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభాల్లో ఉంది. ఉదయం 35,113 వద్ద మొదలైంది. 35,110 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,507 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 132 పాయింట్ల లాభంతో 35,490 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, అల్ట్రాటెక్ సెమ్, కోల్ ఇండియా, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, టాటా కన్జూమర్, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా మిగతా రంగాల సూచీలన్నీ లాభాల్లో ఉన్నాయి. ఆటో, మెటల్, రియాల్టీ షేర్లకు ఎక్కువ గిరాకీ కనిపిస్తోంది.