Stock Market Closing Bell on 26 May 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం లాభాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభపడ్డ సూచీలు తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక మదుపర్లు ఒక్కసారిగా కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,170 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 503 పాయింట్లు లాభపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 53,749 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,950 వద్ద లాభాల్లో మొదలైంది. ఆరంభంలో కొనుగోళ్ల ఊపు కనిపించినా వెంటనే పతనమవ్వడం మొదలైంది. 53,425 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక 54,346 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 503 పాయింట్ల నష్టంతో 54,252 వద్ద ముగిసింది.


NSE Nifty


బుధవారం 16,025 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16105 వద్ద ఓపెనైంది. ఆరంభంలో లాభపడ్డా ఆ తర్వాత ఒడుదొడుకులకు లోనైంది. 15,903 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత 16,204 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 144 పాయింట్లు నష్టపోయి 16,170 వద్ద ముగిసింది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ మాత్రం భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 34,670 వద్ద మొదలైంది. 34,424 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,222 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 755 పాయింట్ల లాభంతో 35,094 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్‌, అపోలో హాస్పిటల్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ 3 శాతం కన్నా ఎక్కువే లాభపడ్డాయి. యూపీఎల్‌, దివిస్‌ ల్యాబ్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌, ఓఎన్‌జీసీ నష్టాల్లో ముగిశాయి. మెటల్‌, ఐటీ, పవర్‌, రియాల్టీ, బ్యాంక్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 1-3 శాతం వరకు ఎగిశాయి.