Stock Market Opeing Bell on 26 May 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం నష్టాల్లో మొదలయ్యాయి. లాభాల్లోనే మొదలైన సూచీలు మెల్లగా నష్టాల్లోకి జారుకున్నాయి. ద్రవ్యోల్బణం భయాలు అలాగే ఉన్నాయి. ఆసియా మార్కెట్లు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు రావడం మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15,925 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 215 పాయింట్లు నష్టపోయింది.


BSE Sensex


క్రితం సెషన్లో 53,749 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,950 వద్ద లాభాల్లో మొదలైంది. ఆరంభంలో కొనుగోళ్ల ఊపు కనిపించినా వెంటనే పతనమవ్వడం మొదలైంది. 53,456 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,102 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 251 పాయింట్ల నష్టంతో 53,492 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 16,025 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16105 వద్ద ఓపెనైంది. ఆరంభంలో లాభపడ్డా ఆ తర్వాత ఒడుదొడుకులకు లోనైంది. 15,910 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,129 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 100 పాయింట్లు నష్టపోయి 15,924 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ మాత్రం లాభాల్లో ఉంది. ఉదయం 34,670 వద్ద మొదలైంది. 34,424 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,720 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 125 పాయింట్ల లాభంతో 34,464 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 14 కంపెనీలు లాభాల్లో 36 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ లాభాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బీపీసీఎల్‌, యూపీఎల్‌, దివిస్‌ ల్యాబ్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌, ఐటీ మినహా మిగతా సూచీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, హెల్త్‌ కేర్‌, రియాల్టీ, మెటల్‌, మీడియా, ఎఫ్‌ఎంసీజీ ఒక శాతానికి పైగా పతనం అయ్యాయి.