Stock Market Opening Bell on 14 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి! ఒకవైపు ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతున్నాయి. నేడూ నష్టాల్లోనే మొదలైనా హఠాత్తుగా మదుపర్లు కొనుగోలు బాట పట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 37 పాయింట్ల లాభంతో 15,806, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 90 పాయింట్ల లాభంతో 52,936 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 52,846 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,495 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 52,459 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,976 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఓపెనింగ్‌లో 300 పాయింట్ల వరకు నష్టపోయిన సూచీ ఆ తర్వాత కాస్త పుంజుకుంది. ప్రస్తుతం 90 పాయింట్ల లాభంతో 52,936 వద్ద కొనసాగుతోంది. 


NSE Nifty


సోమవారం 15,774 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 15,674 వద్ద ఓపెనైంది. 15,659 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,815 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 37 పాయింట్ల లాభంతో 15,806 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ఉంది. ఉదయం 33,180 వద్ద మొదలైంది. 33,123 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,468 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 54 పాయింట్ల లాభంతో  33,460 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 16 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, అపోలో హాస్పిటల్స్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, పవర్‌గ్రిడ్‌, విప్రో షేర్లు లాభాల్లో ఉన్నాయి. బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, రిలయన్స్‌, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. రియాల్టీ, మెటల్‌, ఐటీ షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. ఇండియా విక్స్‌ ఒక శాతం వరకు కూల్‌ ఆఫ్‌ అయింది.