Stock Market Opening Bell: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాలు ఉన్నప్పటికీ, బాండ్‌ యీల్డులు పెరుగుతాయని భావిస్తున్నా అమెరికా స్టాక్‌ మార్కెట్లు నిలదొక్కుకున్నాయి. అదే ధైర్యంతో ఆసియా స్టాక్స్‌ మార్కెట్లు లాభపడ్డాయి. దాంతో బెంచ్‌ మార్క్‌ సూచీలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15,952 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 428 పాయింట్లు లాభాల్లో ఉంది. ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.2 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు.   


BSE Sensex


క్రితం సెషన్లో 52,930 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 53,565 వద్ద లాభాల్లో మొదలైంది. 53,625 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఉదయం నుంచే కొనుగోళ్ల మద్దతు లభించింది.  53,257 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 428 పాయింట్ల లాభంతో 53,359 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


గురువారం 15,808 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 15,977 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే లాభాల బాట పట్టింది. 16,032 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. కొనుగోళ్ల జోరుతో 15,932 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఉదయం 10 గంటల సమయంలో 146 పాయింట్ల లాభంతో 15,952 వద్ద ఉంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో మొదలైంది. ఉదయం 33,925 వద్ద మొదలైంది. 33,660 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,967 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 183 పాయింట్ల లాభంతో 33,717 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్‌, సన్‌ ఫార్మా, యూపీఎల్‌, అపోలో హాస్పిటల్స్‌, టైటాన్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, ఎన్‌టీపీసీ, అల్ట్రాటెక్‌ సెమ్‌, విప్రో, శ్రీసెమ్‌ నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రియాల్టీ 1-2 శాతం వరకు పెరిగాయి.