Stock Market Opening Bell 8 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు మెరుగ్గా ఓపెనవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు అందడంతో మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. క్రూడాయిల్‌ ధరలు తగ్గడం, రూపాయి బలోపేతానికి ఆర్బీఐ చర్యలు తీసుకోవడంతో సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 75 పాయింట్ల లాభంతో 16,208, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 277 పాయింట్ల లాభంతో 54,445 వద్ద చలిస్తున్నాయి. 


BSE Sensex


క్రితం సెషన్లో 54,178 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,574 వద్ద లాభాల్లో మొదలైంది. 54,350 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 54,625 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 277 పాయింట్ల లాభంతో 54,455 వద్ద కొనసాగుతోంది.  


NSE Nifty


గురువారం 16,139 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,273 వద్ద ఓపెనైంది. 16,177 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,257 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 75 పాయింట్ల లాభంతో 16,208 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 35,258 వద్ద మొదలైంది. 35,068 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,149 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 228 పాయింట్ల లాభంతో 35,149 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ఉన్నాయి. ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, మారుతీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మెటల్‌, రియాల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మినహా మిగతా సూచీలన్నీ లాభాల్లో కదలాడుతున్నాయి. మీడియా ఒక శాతం కన్నా ఎక్కువగా ఎగిశాయి.