Stock Market Closing Bell 22 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం  రక్తమోడాయి!  ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. అమెరికా, ఐరోపా మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. సరఫరా కొరత, ధరల పెరుగుదలతో కంపెనీల మార్జిన్లు దెబ్బతింటున్నాయి. ఫలితంగా బెంచ్‌ మార్క్‌ సూచీలు పతనం అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 225 పాయింట్ల నష్టంతో 15,413, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 709 పాయింట్ల నష్టంతో 51,822 వద్ద ముగిశాయి. రూపాయి తాజా కనిష్ఠాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే 78.38 వద్ద కొనసాగుతోంది.


BSE Sensex


క్రితం సెషన్లో 52,532  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,186 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 51,739 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,272 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 709 పాయింట్ల నష్టంతో 51,822 వద్ద ముగిసింది. ఎర్లీ ట్రేడ్‌లో 520 పాయింట్ల మేర నష్టపోయిన సూచీ ఆ తర్వాత కాస్త కోలుకుంది. మళ్లీ ఐరోపా మార్కెట్లు తెరవగానే ఢమాల్‌ అయింది.


NSE Nifty


మంగళవారం 15,638 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 15,545 వద్ద ఓపెనైంది. 15,385 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,565 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 225 పాయింట్ల నష్టంతో 15,413 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ భారీ నష్టాల్లో ముగిసింది. ఉదయం 33,051 వద్ద మొదలైంది. 32,758 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,106 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 346 పాయింట్ల నష్టంతో 32,845 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభాల్లో 45 నష్టాల్లో ముగిశాయి. బీపీసీఎల్‌, హీరోమోటోకార్ప్‌ దివీస్‌ ల్యాబ్‌, టీసీఎస్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. యూపీఎల్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ షేర్లు 3-6 శాతం వరకు పతనమయ్యాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. మెటల్‌ సూచీ 4 శాతానికి పైగా పతనమైంది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మీడియా, రియాల్టీ, బ్యాంక్‌, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ 1-2 శాతం వరకు నష్టాలు చవిచూశాయి.