Stock Market at 12 PM, 03 October 2023:
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. క్రూడాయిల్ ధరలు పెరగడం, ఐరోపా మార్కెట్లు పతనమవ్వడం ఇన్వెస్టర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతుండటం సానుకూల అంశం. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 105 పాయింట్లు తగ్గి 19,533 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 300 పాయింట్లు తగ్గి 65,527 వద్ద కొనసాగుతున్నాయి. వాహన విక్రయాలు పెరిగినప్పటికీ ఆటో సూచీ పతనమవ్వడం గమనార్హం.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,828 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,813 వద్ద మొదలైంది. 65,344 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,813 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 300 పాయింట్లు తగ్గి 65,527 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 19,638 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,622 వద్ద ఓపెనైంది. 19,479 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,623 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 105 పాయింట్లు తగ్గి 19,533 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ తగ్గింది. ఉదయం 44,561 వద్ద మొదలైంది. 44,243 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,566 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 223 పాయింట్ల నష్టంతో 44,360 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 12 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యునీలివర్, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, ఐచర్ మోటార్స్, హిందాల్కో, మారుతీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి. మీడియా, పీఎస్‌యూ బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఆటో, మెటల్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.57,380 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.2000 తగ్గి రూ.71,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.1130 తగ్గి రూ.23,200 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. గురువారం నాటి నష్టాలను కొంత పూడ్చాయి. క్రూడాయిల్ ఫ్యూచర్స్ తగ్గడం ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. పైగా పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువగానే ఉంటుందని నిపుణులు చెప్పడం ఊరటనిచ్చింది. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్లు పెరిగి 19,638 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 320 పాయింట్లు ఎగిసి 65,828 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 83.04 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.