Stock Market Closing Bell 5 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు ఇవాళ (సోమవారం) మిక్స్‌డ్‌గా ఓపెన్‌ అయ్యాయి. మన దేశంలో మేజర్‌ ఈవెంట్లు ఏమీ లేవు కాబట్టి, ఇంటర్నేషనల్‌ క్యూస్‌ మీద ఆధారపడి మన మార్కెట్లు ప్రారంభమయ్యాయి. ఆసియా, అమెరికన్‌, యూరోప్‌ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మన మార్కెట్‌ ప్రారంభానికి ముందే ఆసియా మార్కెట్ల నుంచి నెగెటివ్‌ సిగ్నల్‌ వచ్చాయి. శుక్రవారం ట్రేడింగ్‌ సెషన్‌లో అమెరికన్‌ మార్కెట్లలో సెల్లింగ్‌ కనిపించింది. ఆ మార్కెట్లు పచ్చరంగు నుంచి మారిపోయి ఎర్ర రంగులో ముగిశాయి. డౌజోన్స్‌ దాదాపు 1 శాతం, ఎస్‌&పీ 500 1 శాతం పైగా, నాస్‌డాక్‌ దాదాపు 1.5 శాతం నష్టపోయాయి. ఒపెక్‌ ప్లస్‌ దేశాల సమావేశం ఇవాళ (సోమవారం) ఉంది. ఆయిల్‌ ఉత్పత్తిని అవి తగ్గిస్తాయన్న అంచనాలతో ఆయిల్‌ ధరలు గత మూడు రోజులుగా పెరుగుతున్నాయి. స్టాక్స్‌కు హెడ్జింగ్‌గా ఉపయోగించుకునే గోల్డ్‌ రేట్లు కూడా మూడు రోజులుగా పెరుగుతున్నాయి. దీనివల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ కొద్దిగా దెబ్బతింది. అయితే, మార్కెట్‌ని భారీగా ముంచేసే కారణాలేవీ లేవు కాబట్టి, ఇన్వెస్టర్లు ఏ స్టాండ్‌ తీసుకోకుండా, మిక్స్‌డ్‌గా ఉన్నారు.


BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం), 58,803 పాయింట్ల వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఇవాళ కేవలం 11 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 58,814 వద్ద మొదలైంది. అంటే ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. ఓపెనింగ్‌ అవర్‌లో 58,812.20 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,199.29 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 9.55 గంటల సమయానికి 347.86 పాయింట్లు లేదా 0.59 శాతం లాభంతో 59,151.19 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty
శుక్రవారం సెషన్‌లో 17,539.45 పాయింట్ల వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఇవాళ జస్ట్ 7 పాయింట్లు లేదా 0.02 శాతం లాభంతో 17,546.45 వద్ద ఓపెనైంది. అంటే ఈ ఇండెక్స్‌ కూడా ఫ్లాట్‌గానే ప్రారంభమైంది. ఓపెనింగ్‌ అవర్‌లో 17,540.35 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,646.20 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 9.55 గంటల సమయానికి 101.20 పాయింట్లు లేదా 0.58 శాతం లాభంతో 17,640.65 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank
నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ప్రారంభమైంది. శుక్రవారం సెషన్‌లో 39,421 వద్ద ముగిసిన ఈ ఇండెక్స్‌, ఇవాళ 8 పాయింట్లు లేదా 0.02 శాతం నష్టంతో 39,412 వద్ద ప్రారంభమైంది. దీనిని కూడా ఫ్లాట్‌ ఓపెనింగ్‌గానే పరిగణనించాలి. ఓపెనింగ్‌ నుంచి పుంజుకుంది. ఓపెనింగ్‌ అవర్‌లో 39,407.40 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,764.15 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 9.55 గంటల సమయానికి 263.60 పాయింట్లు లేదా 0.67 శాతం లాభంతో 39,684.60 వద్ద కొనసాగుతోంది.




Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.