By: Rama Krishna Paladi | Updated at : 07 Jul 2023 10:54 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 7 July 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 32 పాయింట్లు తగ్గి 19,465 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 95 పాయింట్లు తగ్గి 65,689 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపుగా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,785 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,559 వద్ద మొదలైంది. 65,491 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,898 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 95 పాయింట్ల నష్టంతో 65,689 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 19,497 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,422 వద్ద ఓపెనైంది. 19,421 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,523 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 32 పాయింట్ల నష్టంతో 19,465 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 45,118 వద్ద మొదలైంది. 45,065 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,227 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 197 పాయింట్లు తగ్గి 45,142 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ఉన్నాయి. టైటాన్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ షేర్లు పెరిగాయి. అపోలో హాస్పిటల్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, హీరోమోటో కార్ప్ షేర్లు నష్టపోయాయి. మీడియా, కన్జూమర్, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా మిగతా రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు ఎక్కువ నష్టపోయాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.90 తగ్గి రూ.59,070గా ఉంది. కిలో వెండి రూ.700 తగ్గి రూ.72,300 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.320 తగ్గి రూ.23,240 వద్ద ఉంది.
Also Read: టమాట, అల్లం కష్టాలు అప్‌గ్రేడ్! ధరల పెరుగుదలతో ప్రజల్లో భయం!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Congratulations ideaForge Technology Limited on getting listed on NSE today! They manufacture Unmanned Aircraft Vehicles for Mapping, Security & Surveillance. ideaForge UAVs help construction and real estate boost their operations. The Public issue of ideaForge Technology Limited… pic.twitter.com/S4TqsuobKW
— NSE India (@NSEIndia) July 7, 2023
Listing ceremony of ideaForge Technology Limited will be starting soon. Watch the ceremony live!https://t.co/SsYnUGFQqo#nse #nseindia #listing #IPO #stockmarket #ShareMarket #ideaforgetechnologylimited @ashishchauhan https://t.co/SsYnUGFQqo
— NSE India (@NSEIndia) July 7, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Ashwin Retirement: "స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్