Stock Market Opening 20 April 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ వచ్చాయి. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్ షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 2 పాయింట్లు పెరిగి 17,620 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 45 పాయింట్లు పెరిగి 59,613 వద్ద ఉన్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,567 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,586 వద్ద మొదలైంది. 59,504 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,836 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 45 పాయింట్ల లాభంతో 59,613 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,618 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,638 వద్ద ఓపెనైంది. 17,590 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,684 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 2 పాయింట్లు పెరిగి 17,620 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,218 వద్ద మొదలైంది. 42,111 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,379 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 90 పాయింట్లు పెరిగి 42,244 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, టైటాన్ షేర్లు లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, ఐచర్ మోటార్స్, సిప్లా, నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.60,930గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.77,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.320 పెరిగి రూ.28,740 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.