Stock Market News In Telugu: స్టాక్‌ మార్కెట్‌లో నేరుగా షేర్లు కొని రిస్క్‌ తీసుకునేకంటే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల ద్వారా ఆ రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. మార్కెట్‌పై తక్కువ అవగాహన ఉన్న వాళ్లు మార్కెట్‌లోకి రావడానికి బెటర్‌ ఆప్షన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌. 


మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడానికి ముందు, లాభనష్టాలతో పాటు పెట్టుబడిదార్లు మరికొన్ని విషయాలను కూడా పరిశీలించాలి. మ్యూచవల్‌ ఫండ్‌ పథకం ఏ కేటగిరీలో ఉంది, ఫండ్ హౌస్ రెప్యుటేషన్‌, స్థూల ఆర్థిక పరిస్థితి, ఆ పథకం అందించిన చారిత్రక రాబడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే, సరైన నిర్ణయం తీసుకోగల అవగాహన వస్తుంది.


ఉదాహరణకు, 21 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ICICI ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్‌ (ICICI Prudential Multi Asset Fund) ఇచ్చిన రిటర్న్స్‌ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈ పథకం AUM (Assets under management) ₹24,060 కోట్లు. మల్టీ-అసెట్‌ కేటగిరీలో, మొత్తం మార్కెట్‌ AUMలో దాదాపు 57 శాతం వాటా ఈ స్కీమ్‌దే.


ICICI ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్‌ అందించిన రాబడి
 ICICI ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్‌ స్కీమ్‌ను ప్రారంభించిన సమయంలో (అక్టోబర్ 31, 2002), ఒకేసారి ఒక లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి ఉంటే, ఆ మొత్తం ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ₹54.9 లక్షలకు పెరిగి ఉండేది. ఇది, 21 శాతం చక్రవడ్డీ రేటుతో (CAGR) పెరిగింది. మరోవైపు, ఈ స్కీమ్ బెంచ్‌మార్క్‌లో ఇంతే మొత్తం పెట్టుబడితో సుమారుగా ₹25.7 లక్షల ఆదాయం వచ్చేది, ఇది 16 శాతం CAGR.


SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ప్రాతిపదికన చూస్తే, ఈ స్కీమ్‌ ప్రారంభం నుంచి SIP ద్వారా నెలకు ₹10,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఆ పెట్టుబడి ₹25.2 లక్షలు అవుతుంది. అయితే, ఆ మొత్తం మాత్రం  ₹2.1 కోట్లకు పెరిగింది, ఇది 17.5 శాతం చక్రవడ్డీ రేటు.


ఈ పథకంలో నెలకు ₹10,000 SIP చొప్పున... ఒక సంవత్సరంలో ₹1.20 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తే అది ₹1.34 లక్షలకు పెరిగింది. మూడేళ్లలో (36 నెలల్లో) ₹3.6 లక్షలు పెట్టుబడి పెడితే అది ₹4.94 లక్షలకు పెరిగింది. ఐదు సంవత్సరాల్లో ₹6 లక్షల పెట్టుబడి ₹10 లక్షలుగా మారింది. ఏడేళ్లలో ₹8.40 లక్షలు పెట్టుబడి పెడితే, అది ₹15.60 లక్షలు అయింది. 


అలాగే, SIP రూట్‌లో 10 సంవత్సరాల పాటు కొనసాగితే, మొత్తం పెట్టుబడి మొత్తం ₹12 లక్షలు కాస్తా ₹27.36 లక్షలకు పెరిగింది. 15 ఏళ్లలో, ₹18 లక్షల పెట్టుబడి ₹64.58 లక్షలుగా వృద్ధి చెందింది.


ఒక ఇన్వెస్టర్‌, గత 21 సంవత్సరాల్లో, అంటే ఈ ఫండ్ ప్రారంభించినప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు, నెలవారీ ₹10,000 SIP చేస్తూ వస్తే, మొత్తం ₹25.2 లక్షల పెట్టుబడి ద్వారా ₹2.1 కోట్లు సంపాదించి ఉండేవాడు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఈ షేర్లు వచ్చే దీపావళి నాటికి మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తాయి!, మోతీలాల్ ఓస్వాల్ రికమెండేషన్స్‌


Join Us on Telegram: https://t.me/abpdesamofficial