Stock Market Closing 26 June 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్‌గా ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ అందాయి. కొనుగోళ్లు చేసేందుకు మదుపర్లు ఆసక్తి ప్రదర్శించలేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 25 పాయింట్లు పెరిగి 18,691 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 9 పాయింట్లు తగ్గి 62,970 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.04 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,979 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,946 వద్ద మొదలైంది. 62,853 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,136 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 9 పాయింట్ల నష్టంతో 62,970 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 18,665 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,682 వద్ద ఓపెనైంది. 18,646 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,722 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 25 పాయింట్ల లాభంతో 18,691 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,714 వద్ద మొదలైంది. 43,541 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,773 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 18 పాయింట్లు పెరిగి 43,641 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 35 కంపెనీలు లాభాల్లో 15 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, టాటా కన్జూమర్, సిప్లా, హీరో మోటో, యూపీఎల్ షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, టీసీఎస్, రిలయన్స్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా షేర్లు నష్టపోయాయి. పీఎస్‌యూ బ్యాంక్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,280గా ఉంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.70,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.290 తగ్గి రూ.24,170 వద్ద ఉంది.
Also Read: పాపులర్ పోస్టాఫీస్ స్కీమ్, FD కూడా దీని ముందు దిగదుడుపే!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.