Stock Market Opening 28 March 2023: 


స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. బెంచ్‌మార్క్‌ సూచీలు ఒడిదొడుకుల్లో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 48 పాయింట్లు తగ్గి 16,937 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 116 పాయింట్లు తగ్గి 57,550 వద్ద కొనసాగుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, కల్యాణ్ జువెలర్స్‌ షేర్లు యాక్టివ్‌గా ట్రేడవుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 57,653 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,751 వద్ద మొదలైంది. 57,524 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,949 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 11 గంటలకు 116 పాయింట్ల నష్టంతో 57,550 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 16,985 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  మంగళవారం 17,031 వద్ద ఓపెనైంది. 16,930 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,061 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 48 పాయింట్లు తగ్గి 16,937 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 39,545 వద్ద మొదలైంది. 39,326 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,563 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 91 పాయింట్లు తగ్గి 39,340 వద్ద చలిస్తోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ఉన్నాయి. హిందాల్కో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బీపీసీఎల్‌, హీరోమోటో కార్ప్‌, భారతీ ఎయిర్టెల్‌ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, మీడియా, బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.240 తగ్గి రూ.59,450 గా ఉంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.20 తగ్గి రూ.25,720 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.