Stock Market Opening 16 September 2022: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ద్రవ్యోల్బణం భయాలు, ఆర్థిక మందగమనం డేటా మదుపర్లను కలవరపెట్టింది. వీటికి తోడు బంగారం ధర తగ్గడం, హాకిష్ ఫెడ్ కామెంట్స్ మదుపర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు కారణమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 179 పాయింట్ల నష్టంతో 17,698 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 584 పాయింట్ల నష్టంతో 59,350 వద్ద ఉన్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 59,934 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,585 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 59,154 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,720 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 584 పాయింట్ల నష్టంతో 59,350 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
గురువారం 17,887 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,698 వద్ద ఓపెనైంది. 17,642 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,820 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 179 పాయింట్ల నష్టంతో 17,698 వద్ద చలిస్తోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 40,977 వద్ద మొదలైంది. 40,818 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,162 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 192 పాయింట్ల నష్టంతో 41,016 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 6 కంపెనీలు లాభాల్లో 44 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, సిప్లా, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా కన్జూమర్, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఆటో, బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు భారీగా ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.