Stock Market Closing Bell: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) బుధవారం భారీగా పతనమయ్యాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఉదయం నుంచి ఆచితూచి కదలాడాయి. మధ్యాహ్నం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగం తర్వాత ఒక్కసారిగా కుప్పకూలాయి. వడ్డీరేట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం మదుపర్లలో నెగెటివ్ సెంటిమెంటుకు దారి తీసింది. ఒక్క గంటలోనే వేల కోట్లు నష్టం వచ్చింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,677 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1306 పాయింట్లు నష్టపోయింది.
BSE Sensex
క్రితం సెషన్లో 56,975 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 57,124 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. ఉదయం నుంచే రేంజ్‌బౌండ్‌లోనే కదలాడింది. 57,184 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు రెపో రేట్లు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంలో సూచీ పతనమైంది. 55,501 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1306 పాయింట్ల నష్టంతో 55,669 వద్ద ముగిసింది.
NSE Nifty
సోమవారం 17,069 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,096 వద్ద ఓపెనైంది. ఉదయం నుంచి ఆచితూచి కదలాడింది. 17,132 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని చేరుకుంది. ముగింపు సమయంలో పనమవ్వడంతో 16,623 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 391 పాయింట్ల నష్టంతో 16,677 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ముగిసింది. ఉదయం 36,266 వద్ద మొదలైంది. 35,127 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,309 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 899 పాయింట్ల నష్టంతో 35,264 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 5 కంపెనీలు లాభపడగా 45 నష్టాల్లో ముగిశాయి. ఓఎన్‌జీసీ, బ్రిటానియా, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, టైటాన్స్, బజాజ్ ఫైనాన్స్ 4-7 శాతం వరకు నష్టపోయాయి. ఇతర సూచీలన్నీ ఎరుపెక్కాయి. ఆటో, బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, పవర్, మెటల్, రియాల్టీ, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1-3 శాతం వరకు పతనం అయ్యాయి.