New Fund Offers: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు శుభవార్త. మరికొన్ని రోజుల్లో కొన్ని కొత్త ఫండ్ ఆఫర్లు (NFOs) అందుబాటులోకి రానున్నాయి. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ ‍‌మ్యూచువల్ ఫండ్ (Motilal Oswal Mutual Fund) ఒక్కటే 5 కొత్త ఫండ్స్‌ను ప్రారంభించబోతోంది.


5 కొత్త ఫండ్స్‌ను లాంచ్‌ చేయడానికి మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన అనుమతుల కోసం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి (SEBI) పత్రాలు దాఖలు చేసింది. ఈ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ‍‌(AMC) ప్రారంభించబోయే కొత్త ఫండ్స్‌... నిఫ్టీ మిడ్‌ స్మాల్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ మిడ్‌ స్మాల్ హెల్త్‌కేర్ ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ మిడ్‌ స్మాల్ ఐటీ & టెలికాం ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ మిడ్‌ స్మాల్ ఇండియా కన్సంప్షన్ ఇండెక్స్ ఫండ్, క్వాంట్ ఫండ్.


ఐదు కొత్త ఫండ్స్‌ వివరాలు
మోతీలాల్ ఓస్వాల్ దాఖలు చేసిన పేపర్ల ప్రకారం...  నిఫ్టీ మిడ్‌ స్మాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ ఫండ్ ఓపెన్-ఎండెడ్ ఫండ్ అవుతుంది, ఇది నిఫ్టీ మిడ్‌ స్మాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టోటల్ రిటర్న్ ఇండెక్స్‌ను ప్రతిబింబిస్తుంది. దీనిని స్వప్నిల్ మయేకర్, రాకేష్ శెట్టి నిర్వహిస్తారు. ఈ పథకం గ్రోత్‌ ఆప్షన్‌తో రెగ్యులర్ & డైరెక్ట్ ప్లాన్స్‌ను అందిస్తుంది. నిఫ్టీ మిడ్‌ స్మాల్ హెల్త్‌కేర్ ఇండెక్స్ ఫండ్‌ను కూడా స్వప్నిల్ మయేకర్, రాకేష్ శెట్టి నిర్వహిస్తారు. నిఫ్టీ మిడ్‌ స్మాల్ హెల్త్‌కేర్ టోటల్ రిటర్న్ ఇండెక్స్‌కు దీనిని బెంచ్‌మార్క్ చేస్తారు.


అదే విధంగా... నిఫ్టీ మిడ్‌ స్మాల్ ఐటీ & టెలికాం ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ మిడ్‌ స్మాల్ ఇండియా కన్సంప్షన్ ఇండెక్స్ ఫండ్, క్వాంట్ ఫండ్‌ వరుసగా... నిఫ్టీ మిడ్‌ స్మాల్ ఐటీ & టెలికాం టోటల్ రిటర్న్ ఇండెక్స్, నిఫ్టీ మిడ్‌ స్మాల్ ఇండియా కన్సంప్షన్ టోటల్ రిటర్న్ ఇండెక్స్, నిఫ్టీ 500 డిఎక్స్‌పై బెంచ్‌మార్క్ చేస్తారు.


ఈ ఫండ్‌ పథకాల్లో ఎలా పెట్టుబడి పెట్టాలి?
మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు కనీస దరఖాస్తు మొత్తం రూ. 500. అక్కడి నుంచి ఎంతైనా జమ చేస్తూ వెళ్లొచ్చు. ఈ స్కీమ్స్‌లో నెలవారీ SIP (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) కనీస మొత్తం కూడా రూ. 500 అవుతుంది. దీనిని కూడా ఎంతైనా పెంచుకోవచ్చు. SIP రూట్‌ ఎంచుకున్న వాళ్లు కనీసం 12 వాయిదాలు కట్టాలన్న షరతు ఉంటుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: స్థిరంగా స్వర్ణం, దిగొచ్చిన రజతం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి