Stock Market Closing Bell 12 September 2022: ఇవాళ (సోమవారం) ఉదయం లాభాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు, అదే ఉత్సాహాన్ని చివరి గంట వరకు కంటిన్యూ చేశాయి. అయితే, చివర్లో మదుపర్లు లాభాలకు దిగడంతో ప్రధాన సూచీలు కొన్ని లాభాలను త్యాగం చేయక తప్పలేదు. సానుకూలాంశం ఏమిటంటే (BSE Sensex) 60,000 మార్క్ పైన, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,900 మార్క్ పైన ముగిశాయి.
BSE Sensex
క్రితం సెషన్‌లో (శుక్రవారం) 59,793 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఇవాళ 59,912 వద్ద లాభాల్లో మొదలైంది. ఇదే దీని ఇంట్రాడే కనిష్టం కూడా. 60,284 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా... 322 పాయింట్లు లేదా 0.54 శాతం లాభంతో 60,115 వద్ద స్థిరపడింది. మదుపర్లు చివర్లో లాభాలను తీసేసుకోవడంతో, డే హై నుంచి 170 పాయింట్లు కోల్పోయింది.
NSE Nifty
శుక్రవారం 17,833 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఇవాళ 17,890 వద్ద ఓపెనైంది. 17,889.15 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,980.55 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరకు 103 పాయింట్లు లేదా 0.58 శాతం లాభంతో 17,936 వద్ద ముగిసింది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఇవాళ తీవ్ర అస్థిరంగా కదిలింది. శుక్రవారం 40,415 పాయిట్ల వద్ద ముగిసిన ఈ సూచీ, ఇవాళ 40,540 వద్ద మొదలైంది. ప్రారంభ గంటలో నిఫ్టీ బ్యాంక్ లాభాల్లోనే ఉన్నా, అక్కడి నుంచి కిందకు జారుకుని, 40,377.90 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మళ్లీ అదే స్థాయిలో పెరిగి, 40,684.90 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఇవాళ ఆద్యంతం ఒడిదొడుకుల్లోనే సాగుతూ, ఫైనల్‌గా 158 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో 40,574 వద్ద ఆగింది.
Gainers and Lossers
నిఫ్టీ50లో 36 కంపెనీలు లాభాలతో ఇంట్రాడేని ముగిస్తే, 14 కంపెనీలు నష్టాలతో కూలబడ్డాయి. అదానీ పోర్ట్స్, టైటన్, టెక్ మహీంద్రా, దివీస్ ల్యాబ్, యాక్సిస్ బ్యాంక్, యూపీఎల్, ఐషర్ మోటార్స్ షేర్లు 1.85 నుంచి 3.77 శాతం వరకు లాభపడ్డాయి. కోల్ ఇండియా, శ్రీ సిమెంట్, నెస్టెల్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా షేర్లు 0.5 - 2.5 శాతం వరకు నష్టపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే, అన్నీ గ్రీన్‌లోనే ఉన్నాయి. నిఫ్టీ మీడియా, రియాల్టీ, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.