Mahindra Group Stocks: మన దేశంలోని అతి పెద్ద వ్యాపార సంస్థల్లో మహీంద్ర గ్రూప్ ఒకటి. ఈ గ్రూప్, ప్రస్తుతం భారతదేశం సహా అనేక దేశాల్లో ఆటోమొబైల్స్, ఆటో ఎక్విప్‌మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాల్లో వ్యాపారం చేస్తోంది. ఈ గ్రూప్‌లోని ఎనిమిది లిస్టెడ్ కంపెనీల్లో, ఐదు కంపెనీలు గత ఏడాది కాలంలో 100% వరకు రాబడిని ఇచ్చాయి, పెట్టుబడిదార్ల డబ్బును రెట్టింపు చేశాయి. అదే సమయంలో, మిగిలిన మూడు కంపెనీల షేర్లు ఫ్లాట్ లేదా ప్రతికూల రాబడిని ఇచ్చాయి.
మహీంద్ర CIE ఆటోమోటివ్ (Mahindra CIE Automotive): వాహన విడిభాగాల తయారీ సంస్థ అయిన మహీంద్రా CIE ఆటోమోటివ్ షేర్ ధర గత ఏడాది కాలంలో భారీ లాభాలను అందించింది. పెట్టుబడిదార్లను ధనవంతులను చేసే విషయంలో, గ్రూప్‌లోని మిగిలిన కంపెనీలను వెనుక్కు నెట్టేసింది. ఒక సంవత్సరం క్రితం, ఈ కంపెనీ షేరు ధర దాదాపు రూ. 200 ఉండగా, అది ఇప్పుడు రూ. 400కి చేరుకుంది. అంటే, ఒక సంవత్సరంలో 100% రాబడిని ఇచ్చింది, తన ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసింది.
మహీంద్ర & మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ (Mahindra & Mahindra Financial Services): మహీంద్ర గ్రూప్‌లోని ఈ NBFC కంపెనీ గత ఏడాది కాలంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ప్రధానంగా, చిన్న పట్టణాలు & గ్రామీణ మార్కెట్లలో ఈ కంపెనీ వాహన రుణాలు ఇస్తుంది. చేస్తుంది. గత ఏడాది కాలంలో ఈ కంపెనీ షేర్ల ధర దాదాపు 75 శాతం పెరిగింది. ప్రస్తుతం ఒక్క షేరు ధర రూ. 260 దగ్గర ఉంది.
మహీంద్ర & మహీంద్ర (Mahindra & Mahindra): గ్రూప్‌లోని ఫ్లాగ్‌షిప్ కంపెనీ ఇది. రాబడి ఇవ్వడంలో ఈ స్టాక్ కూడా ముందంజలోనే ఉంది. ఇటీవలి కాలంలో, ఆటో సెగ్మెంట్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా SUVలను లాంచ్ చేయడం ద్వారా తన మార్కెట్ వాటాను ఈ కంపెనీ పెంచుకుంది. XUV 300, XUV 700, థార్ వంటి వాహనాలను లాంచ్ చేసిన తర్వాత కంపెనీ షేర్లకు చాలా మద్దతు లభించింది. దీంతో, గత ఏడాది కాలంలో ఈ కంపెనీ షేరు 65 శాతానికి పైగా జంప్‌తో రూ. 1,370కి చేరుకుంది.
మహీంద్ర హాలిడేస్ & రిసార్ట్స్ ఇండియా (Mahindra Holidays & Resorts India): కరోనా మహమ్మారి కారణంగా హోటళ్లు, ప్రయాణం వంటి రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే, ఇప్పుడు మహమ్మారి ప్రభావం తగ్గింది, కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో హోటళ్లు, ప్రయాణ రంగాలు వేగంగా కోలుకుంటున్నాయి. ఈ రంగాలకు చెందిన ప్రధాన కంపెనీలు దీని ద్వారా లబ్ధి పొందుతున్నాయి. మహీంద్ర గ్రూప్‌కు చెందిన మహీంద్ర హాలిడేస్ అండ్ రిసార్ట్స్ ఇండియా షేర్ ధర కూడా గత ఏడాది కాలంలో దాదాపు 40 శాతం పెరిగింది.
మహీంద్ర లైఫ్‌స్పేస్ డెవలపర్స్ (Mahindra Lifespace Developers): మహీంద్ర గ్రూప్‌లోని ఈ కన్‌స్ట్రక్షన్ కంపెనీ షేర్ ప్రైస్ గత ఏడాది కాలంలో 25 శాతానికి పైగా లాభపడింది. ఈ సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో పని చేస్తుంది, పెద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టులను కడుతుంది. చాలా బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్ మీద బుల్లిష్‌గా ఉన్నాయి, రాబోయే కాలంలోనూ ఈ షేర్ల మెరుగైన పనితీరు కనబరుస్తాయని ఆశిస్తున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.