కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2 వచ్చేసింది. మంగళవారం కంపెనీ ఈ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. క్వాడ్‌ రియర్‌ కెమేరాలు, 20:9 అమోలెడ్‌ తెర, అద్భుతమైన ఫినిషింగ్‌తో చూడగానే ఆకట్టుకొనేలా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో జీ95 ఎస్‌ఓసీని ఉపయోగించారు. మెటల్‌ ఫినిషింగ్‌తో రెండు రంగుల్లో లభిస్తోంది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం21 2021 ఎడిషన్‌, మోటోరోలా మోటో జీ31, రియల్‌ మీ 8ఐకి మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2 పోటీ ఇవ్వనుంది.


Micromax In Note 2 Price in India (ధర)


భారత్‌లో 4జీబీ ర్యామ్‌, 64 జీబీతో వస్తున్న మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2  ధరను రూ.13,490గా నిర్ణయించారు. నలుపు, ఓక్‌ రంగుల్లో లభిస్తోంది. జనవరి 30 అర్ధరాత్రి నుంచి ఫ్లిఫ్‌కార్ట్‌, Micromaxinfo.com వెబ్‌సైట్ల ద్వారా విక్రయించనున్నారు. ప్రారంభ ఆఫర్‌గా మైక్రోమాక్స్‌ ఇన్‌ నోట్‌ 2ను రాయితీతో రూ.12,490కే అందిస్తున్నారు. ఈ ఆఫర్‌ పరిమిత కాలమే ఉండనుంది!


Micromax In Note 2 Features (ఫీచర్లు)


* ఈ డ్యుయల్‌ సిమ్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11తో నడవనుంది.
* 6.43 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ (1,080x2,400 pixels) ఆమోలెడ్‌ తెర.
* తెర 20:9 రేషియోతో వస్తోంది. 550 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఉంటుంది.
* గోరిల్లా గ్లాస్‌ రక్షణ.
* 4 జీబీ ర్యామ్‌, మీడియా టెక్‌ హీలియో జీ95 ఎస్‌వోసీ ప్రాసెసర్‌
* 48 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌తో క్వాడ్‌ రియర్‌ కెమేరా సెటప్‌, 5ఎంపీ అల్ట్రా వైడ్‌ షూటర్‌, 2 ఎంపీ మాక్రో షూటర్‌,2 ఎంపీ డెప్త్‌ కెమేరా
* సెల్ఫీలు, వీడియో ఛాట్స్‌ కోసం 16 ఎంపీ సెల్ఫీ సెన్సర్‌ కెమేరా
* 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, 256 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.
* 4G ఎల్‌టీఈ, వైఫై 802.11ac, బ్లూటూత్‌ v5.0, GPS/ A-GPS, యూఎస్‌బీ టైప్‌-C, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌, ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌
* 5000 mAh బ్యాటరీ, 30W ఫాస్ట్‌ ఛార్జింగ్‌. 50 శాతం బ్యాటరీ 25 నిమిషాల్లోనే నిండుతుంది.
* బరువు 205 గ్రాములు.


Also Read: Cyber Attack: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు


Also Read: Nirmala Sitharaman Profile: పేరే.. 'నిర్మల'! ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో 'మదురై మీనాక్షి'!!


Also Read: Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?