Market Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు నేడు స్మార్ట్ ట్రేడింగ్ చేపట్టారు. వాస్తవానికి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, STT పెంపు ప్రకటన తర్వాత ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే మార్కెట్ల ముగిసే నాటికి ఇవి తిరిగి తేరుకున్నారు. వాస్తవానికి ఇంట్రాడేలో గరిష్ఠంగా 1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ క్విక్ రికవరీని ప్రదర్శించింది. 


మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ కేవలం 73 పాయింట్ల నష్టానికి పరిమితం కాగా, నిఫ్టీ సూచీ 30 పాయింట్ల నష్టంతో నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి. వాస్తవానికి నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ సూచీలు 1 శాతానికి పైగా లాభంలో ఉండగా మిగిలిన 11 రంగాల సూచీలు నష్టాలను నమోదు చేశాయి. వాస్తవానికి మోదీ బడ్జెట్ రియల్టీ, నిర్మాణ రంగానికి పెద్ద పీట వేస్తున్న ఆశించగా అది జరగకపోవటంతో ఈ రంగంలోని షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే బడ్జెట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేయటం రియల్టీ రంగానికి పెద్ద కుదుపుగా నిపుణులు చెబుతున్నారు.


వాస్తనానికి నేడు మార్కెట్లను రియల్టీ రంగంలోని కంపెనీల కిందకు లాగగా.. ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలకు చెందిన కంపెనీలు లాభాల్లో ఉండటంతో మార్కెట్ నష్టాలు తగ్గాయి. అయితే మార్కెట్లు ముగిసే సమయానికి బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు సైతం నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి. 


మార్కెట్ల ముగింపు సమయంలో ఎన్ఎస్ఈలో టైటాన్, ఐటీసీ, టాటా కన్జూమర్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ హిందుస్థాన్ యూనీలివర్ సహా మరిన్ని కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎల్ అండ్ టి, హిందాల్కొ, శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, బీపీసీఎల్, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.