Cooking Gas Price Hike: సామాన్యులకు భారీ షాక్! వంటింటి గ్యాస్ సిలిండర్ ధర (LPG Cylinder Rate) భారీగా పెరిగింది. ఒకేసారి ఏకంగా రూ.50 ఎగబాకింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు (Crude Oil Price) పెరుగుదలే ఇందుకు కారణమని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి. గత అక్టోబరు నుంచి వంట గ్యాస్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఇక వాణిజ్య అవసరాలకు వాడే 19 కిలోల సిలిండర్ ధర రూ.2003.50కి చేరింది.
ఇంటి అవసరాల కోసం వాడే సిలిండర్ ధర ప్రస్తుతం హైదరాబాద్‌లో (Gas Cylinder Price in Hyderabad) రూ.949.5 ఉండగా, తాజాగా పెరిగిన ధరలతో 14 కేజీల సిలిండర్ ధర రూ.1002కి చేరింది. అటు దేశ వ్యాప్తంగా ఇతర నగరాల్లోనూ వంట గ్యాస్ ధరలు ఇదే తరహాలో పెరిగాయి. తాజా పెంపుతో ఆంధ్రప్రదేశ్‌లో 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1008కి చేరింది. ఇప్పటికే వంటనూనెల ధరలు పెరగడంతో సతమతం అవుతున్న సామాన్యుడి నెత్తిన ఇప్పుడు గ్యాస్ బండ పడినట్టు అయింది.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine War) నేపథ్యంలో ముడిచమురు ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. యూరోపియన్ యూనియన్ రష్యా ఇంధన సరఫరాపై నిషేధాన్ని పరిశీలిస్తోందన్న నివేదికల నేపథ్యంలో ముడి చమురు సరఫరాపై భయాలను రేకెత్తుతున్నాయి. దీంతో చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి.
ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నేడు కూడా దేశ వ్యాప్తంగా ఎగబాకాయి. హైదరాబాద్‌లో (Hyderabad LPG Cylinder Price) మూడు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ బాదుడు కూడా తోడు కావడంతో ఇది సామాన్యులకు మింగుడు పడడం లేదు. ఇలా నిత్యావసరాలు పెరుగుదల మరింత భారంగా మారనుంది.
Also Read: వాహనదారులకు భారీ షాక్! దేశమంతా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు - Hydలోనూ 4 నెలల తర్వాత