Worlds Strongest Insurance Brand: మన దేశంలో అతి పెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) జెండా ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడింది. ప్రపంచంలోనే అత్యంత బలమైన బీమా బ్రాండ్‌గా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంపికైంది. అన్ని గ్లోబల్‌ కంపెనీలను అధిగమించి, టాప్‌ ఇన్సూరెన్స్‌ బ్రాండ్స్‌ (World's top insurance brands) లిస్ట్‌లో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.


LIC బ్రాండ్ విలువ 9.8 బిలియన్‌ డాలర్లు
బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 రిపోర్ట్‌ ప్రకారం, భారత ప్రభుత్వ రంగ సంస్థ LIC బ్రాండ్ విలువ 9.8 బిలియన్‌ డాలర్లుగా వేశారు. బ్రాండ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్, ట్రిపుల్‌ ఏ రేటింగ్‌లో (AAA Rating) LIC 88.3 స్కోర్‌ సాధించింది. ఈ నివేదికలో క్యాథీ లైఫ్ ఇన్సూరెన్స్  (Cathay Life Insurance) రెండో స్థానంలో ఉంది. ఎన్‌ఆర్‌ఎంఏ ఇన్సూరెన్స్  (NRMA Insurance) థర్డ్‌ ప్లేస్‌లో నిలిచింది.


బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ (Brand Finance Insurance) రిపోర్ట్‌ ప్రకారం, తైవాన్‌కు చెందిన క్యాథీ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాండ్ విలువ 9 శాతం పెరిగింది. ఈ బ్రాండ్‌ వాల్యూని 4.9 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు. ఆస్ట్రేలియాకు చెందిన NRMA ఇన్సూరెన్స్ బ్రాండ్ విలువలో ఏకంగా 82 శాతం జంప్ చేసింది. దీని బ్రాండ్ విలువ 1.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. డానిష్ బీమా కంపెనీ ట్రిగ్ (Tryg) బ్రాండ్ విలువ కూడా భారీగా 66 శాతం ఎగబాకి, 1.6 బిలియన్ డాలర్లను టచ్‌ చేసింది. ఓవరాల్‌గా చూస్తే, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చైనా బీమా బ్రాండ్లు ముందున్నాయి. 


రూ.39,090 కోట్ల కొత్త బిజినెస్
ఎల్‌ఐసీ ఇండియా, 2023 ఆర్థిక సంవత్సరంలో, మొదటి సంవత్సరం ప్రీమియంగా (New Business Premium) రూ. 39,090 కోట్లు సంపాదించింది. మన దేశంలో LICకి పోటీ ఇస్తున్న SBI లైఫ్ ఇన్సూరెన్స్, కొత్త బిజినెస్ ప్రీమియం రూపంలో రూ. 15,197 కోట్లు సాధించింది. HDFC లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 10,970 కోట్లు పొందింది. 


ఈ ఏడాది ఫిబ్రవరి 9న, ఎల్‌ఐసీ షేర్లు ఆల్-టైమ్ హై ఫిగర్ రూ.1175 కు చేరుకున్నాయి. గత నెల రోజుల్లో ఈ స్టాక్‌ 13% పైగా నష్టపోయింది. అయితే, గత 6 నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే, ఏకంగా 40% జంప్‌ చేసింది. గత 12 నెలల కాలంలో దాదాపు 66% ర్యాలీ చేసింది. 


ఈ రోజు (బుధవారం, 27 మార్చి 2024) మధ్యాహ్నం 11.50 గంటల సమయానికి 0.83% పెరిగి రూ. 904.80 దగ్గర కదులుతున్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ప్రపంచంలో టాప్‌-10 ధనవంతులు వీళ్లే, భారత్‌ నుంచి ఒకే ఒక్కడు