Latest Gold-Silver Prices 23 July 2024:  బైడెన్‌ తన అభ్యర్థిత్వాన్ని విత్‌డ్రా చేసుకున్న తర్వాతి పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు స్థిరంగా కదులుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,400 డాలర్ల వద్ద ఉంది. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో, మన దేశంలో ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 270 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 250 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 200 రూపాయల చొప్పున తగ్గాయి. వెండి రేటు 400 రూపాయలు దిగి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,580 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,450 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,190 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 95,600 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,580 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 67,450 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,190 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 95,600 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 73,580  ₹ 67,450  ₹ 55,190  ₹ 95,600 
విజయవాడ ₹ 73,580  ₹ 67,450  ₹ 55,190  ₹ 95,600 
విశాఖపట్నం ₹ 73,580  ₹ 67,450  ₹ 55,190  ₹ 95,600 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 6,810 ₹ 7,429
ముంబయి ₹ 6,745 ₹ 7,358
పుణె ₹ 6,745 ₹ 7,358
దిల్లీ ₹ 6,760 ₹ 7,373
 జైపుర్‌ ₹ 6,760 ₹ 7,373
లఖ్‌నవూ ₹ 6,760 ₹ 7,373
కోల్‌కతా ₹ 6,745 ₹ 7,358
నాగ్‌పుర్‌ ₹ 6,745 ₹ 7,358
బెంగళూరు ₹ 6,745 ₹ 7,358
మైసూరు ₹ 6,745 ₹ 7,358
కేరళ ₹ 6,745 ₹ 7,358
భువనేశ్వర్‌ ₹ 6,745 ₹ 7,358

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,108 ₹ 6,597
షార్జా ‍‌(UAE) ₹ 6,108 ₹ 6,597
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,108 ₹ 6,597
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,289 ₹ 6,625
కువైట్‌ ₹ 5,942 ₹ 6,497
మలేసియా ₹ 6,410 ₹ 6,660
సింగపూర్‌ ₹ 6,283 ₹ 6,911
అమెరికా ₹ 6,105 ₹ 6,440

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 320 తగ్గి ₹ 25,520 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: బడ్జెట్‌ నాడు మారిన పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు ధరలు ఇవి