Largecap Dividend Yield Stocks: రెగ్యులర్‌గా, ఎక్కువ డివిడెండ్‌ ఈల్డ్‌ (dividend yield) ఇచ్చే కంపెనీలు ఎప్పుడూ దలాల్‌ స్ట్రీట్‌ డార్లింగ్స్‌ లిస్ట్‌లో ఉంటాయి. వీటిలోనూ లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ అంటే ఇన్వెస్టర్లకు ఎవరెస్టంత ఇష్టం. వందలు, వేల కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టే ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (HNIలు) తమ పోర్ట్‌ఫోలియోల్లో డివిడెండ్‌ స్టాక్స్‌ కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే, ఆ స్టాక్స్‌ ఇచ్చే రిటర్న్స్‌ కంటే ఆ కంపెనీ ప్రకటించే డివిడెండ్‌ అమౌంట్‌ హ్యాండ్సమ్‌గా ఉంటుంది. పెద్ద పెట్టుబడిదార్ల పర్సనల్‌, ప్రొఫెషనల్‌ ఖర్చులన్నింటినీ ఆ డివిడెండ్‌ డబ్బులే తీరుస్తుంటాయి. పైగా.. స్మాల్ క్యాప్‌ & మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌తో పోలిస్తే లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో అస్థిరత తక్కువగా ఉంటుంది, టెన్షన్‌ పెట్టవు. కాబట్టి, లార్జ్‌ క్యాప్‌ డివిడెండ్‌ స్టాక్స్‌కు స్ట్రీట్‌లో ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది.


గత 12 నెలల్లో ఎక్కువ డివిడెండ్ ఈల్డ్స్‌ ఇచ్చిన 10 లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌:


వేదాంత ‍‌(Vedanta)
దలాల్‌ స్ట్రీట్‌లో, 31%తో హైయెస్ట్‌ డివిడెండ్ ఈల్డ్‌ ఇచ్చిన స్టాక్‌ వేదాంత. గత 12 నెలల్లో ఈ కంపెనీ మొత్తం రూ. 88.5 డివిడెండ్ చెల్లించింది.


హిందుస్థాన్ జింక్ (Hindustan Zinc)
25% డివిడెండ్ ఈల్డ్‌తో ఈ స్టాక్‌ సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. గత ఏడాది కాలంలో కంపెనీ ఒక్కో షేరుకు 82.5 రూపాయలను డివిడెండ్‌ రూపంలో షేర్‌హోల్డర్లకు పే చేసింది.


కోల్ ఇండియా (Coal India) 
పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీ కోల్ ఇండియా, గత ఒక ఏడాది కాలంలో ఒక్కో షేరుకు రూ. 23.3 డివిడెండ్ ప్రకటించింది. ఈ కంపెనీ డివిడెండ్ ఈల్డ్‌ 10% వద్ద ఉంది.


ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ONGC)
గత 12 నెలల్లో ఒక్కో షేరుకు 14 రూపాయల డివిడెండ్‌ను ఓఎన్‌జీసీ చెల్లించింది. ఈ కంపెనీ 8% డివిడెండ్ ఈల్డ్‌తో టాప్‌-10 లిస్ట్‌లోకి వచ్చింది.


పవర్ గ్రిడ్ ‍‌(Power Grid), గెయిల్ (GAIL)
ఈ రెండు పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు కూడా తలో 5% డివిడెండ్ ఈల్డ్‌తో షేర్‌హోల్డర్లను ఆకట్టుకున్నాయి. గత 12 నెలల్లో పవర్ గ్రిడ్ రూ. 12.3 డివిడెండ్ చెల్లించగా, గెయిల్ రూ. 5 ఈక్విటీ డివిడెండ్ ప్రకటించింది.


హెచ్‌సీఎల్‌ టెక్ ‍‌(HCL Tech)
ఐటీ సెక్టార్‌ మేజర్‌ కంపెనీల్లో ఒకటైన హెచ్‌సీఎల్‌ టెక్ 4% డివిడెండ్ ఈల్డ్‌ కలిగి ఉంది. గడిచిన ఏడాది కాలంలో ఈ టెక్నాలజీ కంపెనీ ఒక్కో షేరుకు రూ. 48 డివిడెండ్‌ పే చేసింది.


నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (NTPC)
ఎన్‌టీసీపీ కూడా 4% డివిడెండ్ ఈల్డ్‌తో స్ట్రీట్‌ డార్లింగ్స్‌లో ఒకటిగా ఉంది. ఈ కంపెనీ గత 12 నెలల్లో ఒక్కో షేరుపై 7.30 రూపాయల డివిడెండ్ అనౌన్స్‌ చేసింది.


టెక్ మహీంద్ర (Tech Mahindra)
ఐటీ సెక్టార్‌ కంపెనీ అయిన టెక్ మహీంద్ర, గత ఏడాది కాలంలో ఒక్కో షేరుకు రూ. 48 డివిడెండ్‌ చెల్లించింది. ఈ కంపెనీ 4% డివిడెండ్ ఈల్డ్‌తో ఉంది.


ఐటీసీ (ITC)
విభిన్న వ్యాపారా సమ్మేళనం ఐటీసీ, గత 12 నెలల్లో 3% డివిడెండ్ ఈల్డ్‌ కలిగి ఉంది. అదే కాలంలో ఒక్కో షేరుకు 15.5 రూపాయల డివిడెండ్‌ ప్రకటించింది.


మరో ఆసక్తికర కథనం: మీరు రిలయన్స్‌ షేర్‌హోల్డరా?, ఈ నెల 20ని గుర్తు పెట్టుకోండి, ఈ డేట్‌ చాలా ఇంపార్టెంట్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial