వానాకాలంలో రోడ్ల మీద డ్రైవింగ్ చేయడం అనేది సవాలుతో కూడుకున్న అంశం. వర్షాల కారణంగా రోడ్లు వర్షం నీటితో నిండి ఉంటాయి. బురద గుంటల కారంగా ట్రాఫిక్ జామ్ లు, బ్రౌక్ డౌన్లు ఎదురవుతాయి. అయితే, కొన్ని సరైన జాగ్రత్తలతో, వర్షాకాలంలో డ్రైవింగ్ సురక్షితంగా, ఆనందదాయకంగా ఉండేలా చూసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1.మీ టైర్ ట్రెడ్‌లను చూసుకోండి
కారులో రోడ్డుపైకి వెళ్లే ముందు, మీ టైర్లకు తగినంత ట్రెడ్ డెప్త్ ఉందో? లేదో? చూసుకోండి. తడి రోడ్లపై కారు పట్టు సరిగి ఉండాలంటే సరైన మోతాదులో టైర్ ట్రెడ్ అవసరం. ఒకవేళ ట్రెడ్ అరిగిపోయి ఉంటే కొత్త టైర్లను వేసుకోవడం ఉత్తమం. లేదంటే వర్షంలో రోడ్డు మీద వెళ్లే సమయంలో బ్రేకులు వేసినా టైర్లు పట్టును కోల్పోయి, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
2.బ్రేక్‌లు సరిగ్గా పని చేస్తున్నాయో? లేదో? గమనించండి
వాతావరణంతో సంబంధం లేకుండా బ్రేక్‌లు సరిగా పని చేసేలా చూసుకోవాలి. వర్షాకాలంలో వాటి అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. తడి రోడ్లపై వాహనాల ఆగే దూరం పెరుగుతుంది. బ్రేకులు ఫర్ఫెక్ట్ గా లేకపోతే, ఎదుటి వాహనాలను ఢీకొట్టే అవకాశం ఉంటుంది. అందుకే, వర్షంలో బయటకు వెళ్లే సమయంలో ఒకటికి రెండు సార్లు బ్రేకుల పని తీరును గమనించాలి.
3.వైపర్ బ్లేడ్లను తనిఖీ చేయండి
వర్షాకాలంలో సురక్షితమైన డ్రైవింగ్ కోసం క్లియర్ విజుబులిటీ అనేది చాలా ముఖ్యం. అది మీ వైపర్ బ్లేడ్‌లపై ఆధారపడి ఉంటుంది. మీ వైపర్‌లు మంచి స్థితిలో ఉంటే ఎప్పటికప్పుడు కారు అద్దాలపై పడే వర్షం నీటిని క్లియర్ చేస్తాయి. లేదంటే, ముందు చూపు సరిగా కనిపించక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే, ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో వైపర్ బ్లేడ్‌లను మార్చుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
4.సురక్షితమైన దూరాన్ని పాటించండి
వర్షపు వాతావరణంలో ఎక్కువ వేగంతో ప్రయాణించడం మంచిది కాదు. మీ ముందు ఉన్న వాహనం నుంచి సేఫ్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడం మంచింది. ఇలా ఉండటం వల్ల మీరు అవసరమైనప్పుడు బ్రేక్‌లను కొట్టడానికి తగినంత స్పేస్ ఉంటుంది.
5.ఇంధనం టాప్ అప్ లో ఉంచుకోండి
వర్షాకాలంలో ట్రాఫిక్ జామ్‌లు చాలా ఎక్కువగా ఉంటాయి. అరగంట ప్రయాణం ఒక్కోసారి గంట కూడా పట్టే అవకాశం ఉంటుంది. అందుకే, వీలైనంత వరకు ఇంధనాన్ని టాప్ అప్ లో ఉండేలా చూసుకోవడం మంచిది. అంతేకాదు, కారు రోడ్డు మీదకు వచ్చే ప్రతిసారి పెట్రోల్, డీజిల్ సరిపడ ఉందో? లేదో? చెక్ చేసుకోవాలి. మీ ఇంధన ట్యాంక్‌లో కనీసం 50 శాతం నుంచి 60 శాతం ఇంధనం ఉండేలా చూసుకోండి. ఈ సాధారణ టిప్స్ పాటించడం ద్వారా, మీరు మీ మాన్‌సూన్ డ్రైవింగ్ అనుభవాన్ని సురక్షితంగా, మరింత ఆనందదాయకంగా మార్చుకోవచ్చు.
Read Also: కారులో ఉంచకూడని 6 వస్తువులు ఇవే- ఇంతకీ వాటితో కలిగే సమస్యలు ఏంటంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial