Amazon News: ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించిన బిలియనీర్ అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. వాస్తవానికి ఆయన తన ప్రయాణాన్ని చాలా సాధారణంగా చిన్న గది నుంచి పుస్తకాలు అమ్ముకున్న బెజోస్ ప్రపంచం గుర్తించే వ్యాపారాలను, టెక్నాలజీలను సృష్టించారు. దీని వెనుక ఆయన వినూత్న ఆలోచనా ధోరణి సైతం విజయానికి కారణమని కొందరు తెలిసిన వ్యక్తులు చెబుతుంటారు. 


వాస్తవానికి అమెజాన్ వ్యవస్థాపకుడు ఆవిష్కర్తగా విస్తృతంగా పరిగణించబడుతున్న జెఫ్ బెజోస్ తన సమావేశాలన్నింటిలో ఖాళీ కుర్చీ పద్ధతిని వర్తింపజేయడానికి ఇష్టపడేవారు. వాస్తవానికి అమెజాన్ కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద రిటైల్ దిగ్గజాల్లో ఒకటి. అలాగే టెక్నాలజీ లీడర్. కానీ కంపెనీలో ప్రతి ఒక్క మీటింగ్‌లో ఏదో మిస్సింగ్ కనిపించేంది. వాస్తవానికి బెజోస్ ఏదైనా పనిని వినియోగదారుల నుంచి ప్రారంభించి వెనుకకు వెళుతుంటారు. అంటే కస్టమర్ ఆలోచన నుంచి కంపెనీ పనితీరును పరిశీలిస్తుంటారు. అందుకే అమెజాన్‌లోని ప్రతి ప్రాజెక్ట్ లేదా ఉత్పత్తి నమూనా కస్టమర్ కోట్‌లను కలిగి ఉన్న ప్రెస్ రిలీజ్‌తో ప్రారంభమవుతుంది. స్టార్టప్ రెండు దశాబ్ధాల విజయం వెనుక ఇదొక కీలక సూత్రం.


మార్కెట్లో పెరుగుతున్న పోటీని అధిగమిస్తూ వ్యాపారాన్ని దీర్ఘకాలం కొనసాగిస్తూ ప్రయోజనం పొందాలంటే కస్టమర్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమైనదని జెఫ్ బెజోస్ చెబుతుంటారు. దీనిని గుర్తుంచుకోవటం నిజంగా సవాలుతో కూడుకున్నది. అందుకే ప్రతి అమెజాన్ సమావేశంలో వాస్తవానికి కస్టమర్ అక్కడ లేనప్పటికీ వారి కోసం ఒక ఖాళీ కుర్చీని కచ్చితంగా ఉంచుతారని కంపెనీలోని ఒక వ్యక్తి వెల్లడించారు. అందుకే తాము ప్రతి సమావేశంలో మేము కస్టమర్ కోసం సీటును రిజర్వ్ చేస్తామన్నారు. 


1990 తొలినాళ్లలో ఇంటర్నెట్ విప్లవం ప్రారంభం సమయంలో జెఫ్ బెజోస్ ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. అప్పట్లో 30 ఏళ్ల వయస్సున్న బెజోస్ దృష్టిని వెబ్ ఆకర్షించింది. దాని వినియోగం సంవత్సరానికి 2,300% చొప్పున పెరుగుతోంది. ఈ విప్లవంలో తాను వెనుకబడకూడదనున్న బెజోస్ ఆన్‌లైన్‌లో విక్రయించడానికి 20 సాధ్యమైన ఉత్పత్తుల లిస్ట్ రెడీ చేసుకుని వాటి వ్యాపార సాధ్యాసాధ్యాలను పరిశీలించాడు. అప్పుడే అతని చూపు తక్కువ ధర కలిగి, ఎక్కువగా డిమాండ్ ఉన్న పుస్తకాల అమ్మకం వ్యాపారంపై పడింది. దీంతో అతను తొలుత అమెజాన్ ద్వారా పుస్తకాలను విక్రయించాలని నిర్ణయించాడు. 1994లో ప్రారంభమైనప్పటి నుంచి పుస్తకాల రిటైల్ విక్రయం కాకుండా ఇతర రంగాల్లోకి సైతం ప్రవేశించి ఆధిపత్యం చెలాయించింది. 


ఇతర కార్పొరేట్ కంపెనీల మాదిరిగానే వేల సంఖ్యలో సమావేశాలు నిర్వహించే అమెజాన్ ప్రతి సమావేశంలోనూ ఎల్లప్పుడూ ఒక ఖాళీ కుర్చీని కలిగి ఉంటుంది. ఖాళీ కుర్చీ సిద్ధాంతం గురించి పరిశీలిస్తే.. ఈ సిద్ధాతాన్ని సియర్స్ సంస్థ రిటైల్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న సమయంలో కనిపెట్టింది. అయితే ప్రస్తుతం ఈ టెక్నిక్ ను రిటైల్ పవర్‌హౌస్అమెజాన్ స్వీకరించబడింది. అలాగే అమెజాన్ ప్రారంభ రోజులలో జెఫ్ బెజోస్ ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి టీమ్ కేవలం రెండు పిజ్జాలు తినేంత చిన్నదిగా ఉండేలా చూడాలని ఆయన నిర్ణయించారు. దీని వెనుక అసలు సీక్రెట్ వ్యాపారంలో చిన్న టీమ్స్ కలిగి ఉండటం పెద్ద లక్ష్యాలను సాధించటానికి వారందరూ కలిసి పనిచేయగలగాలని, వారు కంపెనీలోని సాధారణ వనరులను యాక్సెస్ చేయగలగాని జెఫ్ ప్లాన్. ఇది సులువులగా లక్ష్యాలను చేధించేందుకు దోహదపడుతుందని ఆయన నమ్మకం. 


రెండు పిజ్జా రూల్:
అమెజాన్ ప్రారంభ రోజులలో, జెఫ్ బెజోస్ ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు: ప్రతి అంతర్గత బృందం రెండు పిజ్జాలతో తినిపించగలిగేంత చిన్నదిగా ఉండాలి. క్యాటరింగ్ బిల్లును తగ్గించడం లక్ష్యం కాదు. ఇది దాదాపు అమెజాన్ చేసే ప్రతిదానిలాగే, రెండు లక్ష్యాలపై దృష్టి పెట్టింది: సామర్థ్యం మరియు స్కేలబిలిటీ. మునుపటిది స్పష్టంగా ఉంది. ఒక చిన్న బృందం టైమ్‌టేబుల్‌లను నిర్వహించడానికి మరియు వ్యక్తులను తాజాగా ఉంచడానికి తక్కువ సమయాన్ని వెచ్చిస్తుంది మరియు పూర్తి చేయాల్సిన పనిని చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తుంది. కానీ ఇది అమెజాన్‌కు నిజంగా ముఖ్యమైనది.