IDFC Merger: HDFC సీన్‌ IDFCలో రిపీట్‌ - ఈసారి 2 కాదు, 3 కంపెనీలు మెర్జర్‌

మెర్జ్‌డ్‌ ఎంటిటీ విలువ రూ.71,767 కోట్లుగా ఉండొచ్చని అంచనా.

Continues below advertisement

IDFC First Bank-IDFC Merger: HDFC బ్యాంక్‌లో దాని పేరెంట్‌ కంపెనీ HDFC లిమిటెడ్‌ విలీనం అయిన కొన్ని రోజుల్లోనే, సేమ్‌ సీన్‌ క్రియేట్‌ అవబోతోంది. IDFC ఫస్ట్ బ్యాంక్‌లో, దాని మాతృ సంస్థ IDFC లిమిటెడ్ మెర్జ్‌ కాబోతోంది. IDFC ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ కూడా IDFC ఫస్ట్ బ్యాంక్‌లో కలిసిపోతుంది. 

Continues below advertisement

IDFC లిమిటెడ్ & IDFC ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీ విలీనానికి IDFC ఫస్ట్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్‌ ఓకే చెప్పింది. HDFC బ్యాంక్ & HDFC లిమిటెడ్ మెర్జర్‌ తర్వాత ఫైనాన్షియల్‌ సెక్టార్‌లో జరుగుతున్న రెండో అతి పెద్ద డీల్ ఇది. 

విలీనం తర్వాత... IDFC లిమిటెడ్ షేర్‌హోల్డర్లు 155:100 రేషియోలో షేర్లు పొందుతారు. అంటే, IDFC లిమిటెడ్‌లో హోల్డ్‌ చేస్తున్న ప్రతి 100 షేర్లకు బదులుగా IDFC ఫస్ట్ బ్యాంక్‌ 155 షేర్లను పొందుతారు.

ఐడీఎఫ్‌సీ లిమిటెడ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ మధ్య ఒప్పందాన్ని బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించిందని, సోమవారం, ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వెల్లడించింది. 

2023 డిసెంబర్‌ నాటికి క్లైమాక్స్‌
ఈ ఏడాది చివరి నాటికి ఈ విలీనం ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. ఈ విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి పొందాల్సి ఉంది. ఇంకా... SEBI, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, BSE, NSE, ఇతర నియంత్రణ సంస్థలు, వాటాదార్ల అనుమతులు కూడా అవసరం.

విలీన కంపెనీ విలువ ఎంత?
రెండు కంపెనీల విలీనం తర్వాత ఏర్పడే మెర్జ్‌డ్‌ ఎంటిటీ వాల్యుయేషన్‌ ఎంత ఉంటుందన్న విషయాన్ని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ చెప్పలేదు. సోమవారం (03 జులై 2023), BSEలో రెండు కంపెనీల షేర్ల క్లోజింగ్‌ ప్రైస్‌ను బట్టి, మెర్జ్‌డ్‌ ఎంటిటీ విలువ రూ.71,767 కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఐడీఎఫ్‌సీ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ వాల్యుయేషన్‌ కూడా దీనికి యాడ్‌ అవుతుంది. IDFC ఫైనాన్షియల్ హోల్డింగ్ ద్వారా, IDFC ఫస్ట్ బ్యాంక్‌లో IDFC లిమిటెడ్ 40 శాతం వాటాను కంట్రోల్‌ చేస్తోంది. 

సోమవారం, IDFC షేర్‌ ప్రైస్‌ 6.3 శాతం పెరిగి రూ.109.20 వద్ద ముగిసింది. IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్‌ ధర 3 శాతం లాభంతో రూ. 81.95 వద్ద క్లోజ్‌ అయింది.

IDFC ఫస్ట్ బ్యాంక్ & IDFC లిమిటెడ్ ఆస్తులు
2023 మార్చి చివరి నాటికి, IDFC ఫస్ట్ బ్యాంక్ మొత్తం ఆస్తుల విలువ రూ.2.4 లక్షల కోట్లు. బ్యాంక్‌ టర్నోవర్ రూ.27,194.51 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నికర లాభం రూ.2437.13 కోట్లు. అదే సమయంలో, IDFC లిమిటెడ్ మొత్తం ఆస్తుల విలువ రూ.9,570.64 కోట్లు, టర్నోవర్ రూ.2,076 కోట్లు.

మరో ఆసక్తికర కథనం: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' IDFC First Bank, DMart

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది..

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

Continues below advertisement
Sponsored Links by Taboola