Jio Financial Services Record High: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రోజు (శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024) కూడా జిల్‌ జిల్‌మంటూ మెరుస్తోంది, 12 శాతం పెరిగి బలంగా ట్రేడ్‌ అవుతోంది. ఈ కంపెనీ షేర్ల కోసం ట్రేడర్లు/ ఇన్వెస్టర్లు ఎగబడడంతో షేర్‌ ధర అమాంతం పెరిగి కొత్త శిఖరాలను తాకింది. మొట్టమొదటిసారిగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ విలువ క్యాపిటలైజేషన్ (Jio Financial Market Capitalization) రూ. 2 లక్షల కోట్లు దాటింది. 


జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను (JFSL) జియో ఫైనాన్స్ అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 2.16 లక్షల కోట్లకు చేరింది. 


ఈ రోజు కూడా, జియో ఫైనాన్స్ షేర్ రికార్డ్‌ స్థాయిలో రూ. 347 కు చేరింది. ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్ -టైమ్ హై లెవెల్ (Jio Financial Services All-time High Level). ఈ కంపెనీ షేర్లు 2023 ఆగస్టు 21న స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయ్యాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSEలో రూ. 262 వద్ద, బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ BSEలో రూ. 265 వద్ద మార్కెట్‌లోకి అడుగు పెట్టాయి.


ఉదయం 11.40 గంటల సమయానికి, జియో ఫైనాన్స్‌ షేర్‌ ధర రూ. 28.85  లేదా 9.53% పెరిగి, రూ. 331.70 దగ్గర ట్రేడవుతోంది. లిస్టింగ్‌ నాటి నుంచి ఇప్పటి వరకు ‍‌(ఆరు నెలల్లో) ఈ స్టాక్‌ రూ. 116.95 లేదా 54.52% పెరిగింది. గత నెల రోజుల్లో రూ. 90.30 లేదా 37.56% జంప్‌ చేసింది.


రూ.20 లక్షల కోట్లు దాటిన రిలయన్స్ ఇండస్ట్రీస్             
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర (Reliance Industries Share Price) కూడా ఈ రోజు కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది, చారిత్రక స్థాయి రూ. 2,989.40 వద్దకు చేరింది. రిలయన్స్‌ షేర్లు ఈ రోజు రూ. 2,971.40 వద్ద ప్రారంభమయ్యాయి.  ఈ ఊపు కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ (Reliance Industries Market Capitalization) రూ.20 లక్షల కోట్లు దాటింది, రూ.20.13 లక్షల కోట్లకు చేరింది. 


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు గత 12 నెలల కాలంలో 36 శాతం, గత నెల రోజుల్లో 12 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దాదాపు 15 శాతం పెరిగాయి.           


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది. 


మరో ఆసక్తికర కథనం: దేశంలో 2జీ, 3జీ సేవలు నిలిపేస్తారా, ఫీచర్‌ ఫోన్‌ వినియోగదార్ల గతేంకాను?