Naresh Goyal: దేశీయ విమానయాన రంగంలో ఒకప్పుడు వెలుగువెలిగిన వ్యక్తి నరేష్ గోయల్. వాస్తవానికి చిన్న ట్రావెల్ ఏజెంట్ స్థాయి నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం విమానయాన కంపెనీని ఏర్పాటు చేసే స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే.
అయితే కెనరా బ్యాంక్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ గత కొంత కాలంగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని నెలలుగా జైలు జీవితం గడుపుతున్నారని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే బాంబే హైకోర్టు సోమవారం వైద్య కారణాలపై రెండు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది గోయల్ కి పెద్ద ఊరటను ఇచ్చే అంశంగా ఉంది. కోర్టు ఆయనకు రూ.లక్ష పూచీకత్తుగా చెల్లించాలని ఆదేశించింది.
ప్రత్యేక కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా ముంబై నగరాన్ని వీడవొద్దని కోర్టు నరేష్ గోయల్‌ని జస్టిస్ ఎన్‌జే జమాదార్ ధర్మాసనం పేర్కొంది. ఈక్రమంలో కోర్టు షరతులను ఆయన తప్పక పాటించాల్సి ఉంటుంది. అలాగే గోయల్ తన పాస్ పోర్టును అప్పగించాలని కోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన గోయల్, అతని భార్య అనితా గోయల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నందున వైద్య, మానవతా కారణాలతో మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేయాల్సిందిగా కోర్డును అభ్యర్థించారు. దీనికి ముందు ఫిబ్రవరిలో బెయిల్ కోసం గోయల్ చేసిన ప్రయత్నాలను కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
అయితే అతనికి నచ్చిన ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి అనుమతించింది. బెయిల్ అభ్యర్థనను దిగువ కోర్టు ఈ ఏడాది మార్చిలో అధికారికంగా తిరస్కరించింది. ఆ తర్వాత గోయల్ మెరిట్‌లపై బెయిల్, వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ హైకోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. తన అనారోగ్యంతో బాధపడుతున్నందున మానవతా దృక్పథంతో కేసును విచారించాలని అమీత్ నాయక్‌తో పాటు గోయల్ తరపు న్యాయవాది హరీశ్ సాల్వే, ఆబద్ పోండా కోర్టును కోరారు. అయితే ఈ క్రమంలో ఈడీ తరపున న్యాయవాదులు బెయిల్ మంజూరును తీవ్రంగా వ్యతిరేకించారు.
కోర్టు అతని ఆసుపత్రిని నాలుగు వారాల పాటు పొడిగించవచ్చని, అతని పరిస్థితిని అంచనా వేయడానికి తాజా వైద్య నివేదిక కోసం పిలవవచ్చని వెనెగావ్కర్ సమర్పించారు. అనారోగ్యం కారణంగా శారీరక ఆరోగ్యం క్షీణించడమే కాకుండా, గోయల్ మానసిక ఆరోగ్యం కూడా బాగో లేదని ఆయన తరఫున వాదిస్తున్న న్యాయవాది హరీష్ సాల్వే కోర్టుకు తెలిపారు. వాస్తవానికి విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు కెనరా బ్యాంక్ ఇచ్చిన రూ.538.62 కోట్ల రుణాలను స్వాహా చేసిన ఆరోపణలపై గోయల్‌ను 2023 సెప్టెంబర్‌లో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ ఛార్జిషీట్‌ను సమర్పించినప్పుడు అతని భార్య అనితా గోయల్‌ను నవంబర్ 2023లో అరెస్టు చేశారు. ఆమె వయస్సు, వైద్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని అదే రోజు ప్రత్యేక కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: రూ.800 కోట్లు కోల్పోయిన రేఖా జున్‌జున్‌వాలా, టాటాలే కారణమా!