ITC Hotels Share Price: పేరెంట్‌ కంపెనీ ఐటీసీ నుంచి విడిపోతున్న ఐటీసీ హోటల్స్‌ షేర్‌ ప్రైస్‌ సెంచరీ కొట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్లు ఈ హోటల్స్ వ్యాపారానికి కట్టే విలువను బట్టి, ఒక్కో షేరు ధర రూ. 100 మార్కు కంటే పైకి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.


ఐటీసీ షేర్‌హోల్డర్లకు 1:10 రేషియోలో ఐటీసీ హోటల్స్‌ షేర్లు ఫ్రీగా అందుతాయి. అంటే, ITCలో హోల్డ్‌ చేస్తున్న ప్రతి 10 షేర్లకు, ITC హోటల్స్‌కు చెందిన ఒక షేర్‌ డీమ్యాట్‌ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది.


కొత్త షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కావడానికి ITC షేర్‌హోల్డర్లు 2024 నవంబర్‌లో వచ్చే దీపావళి వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. 


ఐటీసీ హోటల్స్‌ డీమెర్జర్ ప్లాన్‌ ప్రకారం, దాని 36 లక్షల వాటాదారులకు వాల్యూ అన్‌లాక్ కావడమే కాదు, పేరెంట్‌ కంపెనీ నుంచి మూలధన కేటాయింపులు కూడా పెరుగుతాయి. ITC హోటల్స్‌లో ITCకి 40% వాటా ఉంటుంది. మిగిలిన 60% వాటా పబ్లిక్‌ చేతుల్లో ఉంటుంది. పేరెంట్‌ కంపెనీ ఐటీసీలో ఉన్న వాటాల నిష్పత్తి ప్రకారం ITC హోటల్స్‌లో వాటా దక్కుతుంది.


షేర్‌హోల్డర్లకు ఇచ్చే వాటా అర్హత నిష్పత్తిని లెక్కించేటప్పుడు వాల్యుయేషన్ మెట్రిక్‌ను ITC ఉపయోగించలేదు. ఎందుకంటే, హోటల్స్ వ్యాపారం నుంచి వచ్చే 100% ఆర్థిక ప్రయోజనం ITC వాటాదార్లకు (60% నేరుగా, 40% ITC ద్వారా) చేరాలని పేరెంట్‌ కంపెనీ భావించింది.


కంపెనీ బోర్డ్‌ నిర్ణయించిన అర్హత నిష్పత్తి (1:10) ITC హోటల్స్ మార్కెట్ విలువ (ITC Hotels market cap) మీద ఎలాంటి ఎఫెక్ట్‌ చూపదు. కానీ, షేర్‌ ప్రైజ్‌ మీద మాత్రం ప్రభావం చూపుతుంది.


ఐటీసీ హోటల్స్‌కు 208 కోట్ల షేర్లు


ITCలో మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య ఇప్పుడు దాదాపు 1,246 కోట్లు. డీమెర్జర్‌కు ముందు ITC హోటల్స్‌కు 83 కోట్లు ఉన్నాయి. రెండు కంపెనీ షేర్ల ముఖ విలువ (face value) ఒక రూపాయి.


1:10 నిష్పత్తి ప్రకారం... ITC 124.6 కోట్ల ఫ్రెష్‌ షేర్లను జారీ చేస్తుంది. దీనివల్ల ITC హోటల్స్ మొత్తం షేర్ క్యాపిటల్ దాదాపు 208 కోట్ల షేర్లకు (83 కోట్లు + 125 కోట్లు) చేరుతుంది.


FY23లో రూ.852 కోట్ల ఎబిటాను హోటల్‌ బిజినెస్‌ నివేదించింది. ఈ ప్రకారం, FY25లో 18-20x EV/EBITDA అంచనాల ఆధారంగా ఐటీసీ హోటల్స్‌ కంపెనీ విలువ దాదాపు రూ. 20,000-24,000 కోట్లు.


లిస్టింగ్‌ తర్వాత ఐటీసీ హోటెల్స్‌ షేర్‌ ప్రైస్‌ ఎంత ఉండొచ్చు?


ఐటీసీ హోటెల్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 19,000 కోట్లయితే, ఒక్కో షేర్‌ ధర రూ. 91 అవుతుంది.
మార్కెట్‌ క్యాప్‌ రూ. 20,000 కోట్లయితే, ఒక్కో షేర్‌ ధర రూ. 96 అవుతుంది.
మార్కెట్‌ క్యాప్‌ రూ. 21,000 కోట్లయితే, ఒక్కో షేర్‌ ధర రూ. 101 అవుతుంది.
మార్కెట్‌ క్యాప్‌ రూ. 22,500 కోట్లయితే, ఒక్కో షేర్‌ ధర రూ. 108 అవుతుంది.
మార్కెట్‌ క్యాప్‌ రూ. 24,000 కోట్లయితే, ఒక్కో షేర్‌ ధర రూ. 115 అవుతుంది.


మరో ఆసక్తికర కథనం: ఎస్‌బీఐ స్పెషల్‌ స్కీమ్‌ మళ్లీ వచ్చిందోచ్‌, ₹5 లక్షలకు ₹43,000 వడ్డీ మీ సొంతం


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial