ఇంట్లో పెళ్లి అగ్రిమెంట్ సంగతి చెప్పకుండా వెళ్లిపోతున్నందుకు చాలా గిల్టీగా ఉందని కృష్ణ బాధపడుతుంది. తర్వాత అగ్రిమెంట్ సంగతి తెలిస్తే అందరూ ఏమనుకుంటారు. ‘నా అవసరం కోసం మీ ఫ్యామిలీని మోసం చేశానని అనుకుంటారు కదా. నన్ను చెప్పనివ్వలేదు. మీరు చెప్పలేదు కానీ అందరి దృష్టిలో నన్ను దోషిని చేశారని’ ఫీలవుతుంది. ఇద్దరూ విడిపోతున్నందుకు కన్నీళ్ళు పెట్టుకుంటారు. అప్పుడే కృష్ణ ఫోన్ కి మెసేజ్ వస్తుంది. నందు మెసేజ్ చేసిందా? ఖచ్చితంగా తను నా ప్రేమ గురించి చెప్తూ మెసేజ్ చేసి ఉంటుంది. అది కృష్ణ చూడకూడదని మురారీ మనసులో అనుకుంటాడు. దారి మధ్యలో ఒక చోట ఆగి కారు దిగి షాపు దగ్గరకి వెళ్తుంది కృష్ణ. అప్పుడు మురారీ కృష్ణ ఫోన్ తీసుకుని నందు పంపించిన మెసేజ్ డిలీట్ చేస్తాడు. ఒకరి ప్రేమ మరొకరు చెప్పుకోకుండా అపార్థాలు చేసుకుంటూ దూరం కావడం ఏంటో? రోజురోజుకీ సీరియల్ మరింత వరస్ట్ గా మార్చేస్తున్నారు.


నందు కృష్ణ మెసేజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇందాకటి దాకా కృష్ణ డీపీ కనిపించింది ఇప్పుడు అది కూడా కనిపించడం లేదంటే తను నెంబర్ బ్లాక్ చేసి ఉంటుందని నందు అనుకుంటుంది. కాల్ ట్రై చేస్తే కలవదు. చాలా బాధగా ఉంది గౌతమ్.


Also Read: రాజ్ కి ఉప్మా కష్టాలు- అపర్ణ బుర్రలో విషం నింపుతున్న రుద్రాణి


నందు: వాయిస్ మెసేజ్ వినే బ్లాక్ చేసింది. మా అన్నయ్య చెప్పింది కరెక్ట్ తను వాడిని ప్రేమించడం లేదు


గౌతమ్: కృష్ణ విషయంలో మురారీ కరెక్ట్ గానే ఉన్నాడు. ఇందులో కృష్ణ తప్పు లేదు. కృష్ణ దృష్టిలో మురారీ జీవితాన్ని ఇచ్చిన దేవుడు అని ఉంది


నందు: కేవలం తన గోల్ రీచ్ అవడం కోసం అన్నయ్యని, మా ఫ్యామిలీని మోసం చేసినట్టే కదా. ఇష్టం లేకుండా ప్రేమ లేకుండా ఎలా ఉంటారు. మనసులో ఇంత పెట్టుకుని పైకి ఎంత ప్రేమ ఒలకబోసింది. వాడితో నటించినట్టే మనతో కూడా నటించి ఉంటుంది కదా. మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మనం ఎందుకు బాధపడాలి. పద వెళ్లిపోదాం


నంది వెలుగు గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంప్ దగ్గరకి మురారీ కృష్ణని తీసుకుని వస్తాడు. ఇద్దరూ మళ్ళీ మనసులోనే మాట్లాడుకుంటారు. జీవితాంతం మిమ్మల్ని మార్చిపోలేనని కృష్ణ మనసులో అనుకుని చేతులెత్తి దణ్ణం పెడుతుంది. తన బ్యాగ్స్ మొత్తం కారులో నుంచి తీసుకోవడంతో కృష్ణ ఇక రాదు తన నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుందని మురారీ బాధపడతాడు. కృష్ణని దింపేసి వెళ్ళిపోతాడు. తను వెళ్లిపోవడంతో గుండెలు పగిలేలా ఏడుస్తుంది.


Also Read: ట్విస్టుల మీద ట్విస్టులు, అభిమన్యుతో చేతులు కలిపిన మాళవిక - వేద మీద రౌడీల అటాక్


భవానీ దేవి గదిలో కృష్ణ ఫోటో చూసి ఆశ్చర్యపోతుంది. మీరే నాకు గురువు, దైవం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని లెటర్ రాసి పెడుతుంది. అది చూసి భవానీ ఎమోషనల్ అవుతుంది. ఇక ముకుంద కృష్ణ లేదని హ్యాపీగా ఉంటుంది. ఇంటి గుమ్మం ముందు నిలబడి ఈ ఇంట్లోకి ఆదర్శ్ భార్యగా ఎడమ కాలు పెట్టి లోపలికి వచ్చాను. ఇప్పుడు మురారీ భార్యగా కుడి కాలు పెట్టి లోపలికి వస్తానని అనుకుని అలాగే ఇంట్లోకి వస్తుంది. మురారీతో సంతోషంగా గడిపినట్టు ఊహించుకుంటుంది. టేబుల్ మీద ముకుందకి కృష్ణ లెటర్ రాసి పెడుతుంది. పెళ్లి శాశ్వతం, ప్రేమని మర్చిపొమ్మని చెప్తుంది. ఆ పేపర్ ని కోపంగా విసిరేస్తుంది. ముకుంద నీకు అన్నీ తెలుసు. నీ ప్రేమని మర్చిపోయి పెళ్లి జీవితాన్ని సంతోషంగా గడుపు. నీ టాలెంట్ ని నీలో దాచుకోకుండా ప్రపంచానికి తెలిసేలా చెయ్యి. నువ్వు నవ్వితే చాలా బాగుంటావ్ దాన్ని చెరగనివ్వకు అని రాస్తుంది. ఆ లెటర్ ని కోపంగా చింపేస్తుంది.


ముకుంద: నీ మీద నాకు ఎప్పుడు కోపం లేదు కానీ మురారీ భార్యగా వచ్చావని అసూయ. నాకు దక్కాల్సిన ప్రేమ నీకు ఎక్కడ దక్కుతుందా అని భయం. కానీ ఇప్పుడు నీమీద మంచి ఫీలింగ్ కలిగింది. నువ్వు నాకు మంచి ఫ్రెండ్