IT Stocks: కొంతకాలంగా ఐటీ స్టాక్స్‌కు గడ్డుకాలం నడుస్తోంది. నిఫ్టీలోని 10 IT కౌంటర్లలో 4, వాటి 5 సంవత్సరాల సగటు PE స్థాయిల కంటే దిగువన ట్రేడవుతున్నాయి.
ఇన్ఫోసిస్ స్టాక్, దాని ఆల్-టైమ్ హై లెవెల్ నుంచి 35% పైగా పడిపోయింది. 5 సంవత్సరాల సగటు PE 25.59 అయితే, ప్రస్తుతం 21.71 PE వద్ద, డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంది. IT మేజర్ TCS కూడా గరిష్ట స్థాయి నుంచి 22% పైగా క్షీణించింది. దాని 5 సంవత్సరాల సగటు PE 29 కంటే తక్కువగా 27 PE వద్ద దొరుకుతోంది. తగినంతమంది కొనుగోలుదార్లు లేదా డిమాండ్ వీటికి దొరకడం లేదని దీని అర్ధం. యంఫసిస్, విప్రో కూడా వాటి ఐదేళ్ల సగటు PE స్థాయిల కంటే తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. ఈ రెండూ గరిష్ట స్థాయి నుంచి సగానికి పైగా పడిపోయాయి.
అన్ని నిఫ్టీ IT స్టాక్స్‌లో పెర్సిస్టెంట్ సిస్టమ్ కొంత మెరుగ్గా ఉంది, ఇది కేవలం 15% తగ్గింది. దాని సగటు వాల్యుయేషన్ కంటే పైనే ట్రేడవుతోంది.
చాలా బ్రోకరేజ్‌లు ఐటీ స్టాక్స్ మీద ప్రస్తుతానికి బేరిష్‌గా ఉన్నాయి. ప్రపంచ అనిశ్చితుల కారణంగా, ఐటీ కంపెనీల భవిష్యత్ మీద మబ్బులు కమ్ముకున్నాయని చెబుతున్నాయి. ఐటీ స్టాక్స్‌కు ఇచ్చిన రేటింగ్స్ తగ్గిస్తున్నాయి.
10 ఐటీ స్టాక్స్, వాటి పతన స్థాయి:
విప్రో - Wipro ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 50TTM PE: 17.75ఐదేళ్ల సగటు PE: 18.42
టెక్ మహీంద్ర - Tech Mahindra ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 44TTM PE: 19.13ఐదేళ్ల సగటు PE: 17.26
హెచ్‌సీఎల్ టెక్ - HCL Tech ఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 23TTM PE: 19.96ఐదేళ్ల సగటు PE: 17.62
యంఫసిస్ - Mphasisఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 51TTM PE: 20.67ఐదేళ్ల సగటు PE: 23.76
ఇన్ఫోసిస్ - Infosysఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 35TTM PE: 21.71ఐదేళ్ల సగటు PE: 25.59
టీసీఎస్ - TCSఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 23TTM PE: 27.18ఐదేళ్ల సగటు PE: 28.95
కోఫోర్జ్ - Coforgeఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 34TTM PE: 31.24ఐదేళ్ల సగటు PE: 27.08
ఎల్‌టీఎస్‌ఎస్ - LTSSఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 42TTM PE: 32.49ఐదేళ్ల సగటు PE: 31.91
పెర్సిస్టెంట్ సిస్టమ్స్ - Persistentఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 15TTM PE: 38.19ఐదేళ్ల సగటు PE: 25.81
ఎల్‌టీ మైండ్‌ట్రీ - LTIMindtreeఆల్ టైమ్ హై నుంచి ఎంత తగ్గింది: 43TTM PE: 43.28ఐదేళ్ల సగటు PE: 27.99
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.