నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబయిలో ఆమెకు చెందిన ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు చేశారు. పన్ను ఎగవేత కేసులో ఐటీ రైడ్స్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు
ఎవరా యోగిె?
చిత్రా రామకృష్టతో పాటు కొంతమంది అధికారులపై పన్ను ఎగవేత, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. అయితే చిత్ర రామకృష్ణ.. ఎన్‌ఎస్‌ఈ ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, డివిడెండ్లకు సంబంధించిన విషయాలతో పాటు అంతర్గత సమాచారాన్ని ఓ యోగితో పంచుకున్నట్లు తేలింది.
ఆయన డైరెక్షన్‌లోనే
ఎన్‌ఎస్‌ఈకి సీఈవోగా ఉన్న సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలో ఏ పని చేయాలన్నా హిమాలయాల్లో ఉంటున్న ఓ యోగి ఆమోద ముద్ర పడితే కానీ చిత్రా ముందడుగు వేయలేదు.
ఎన్‌ఎస్‌ఈలో ఎవరిని నియమించాలి? ఎవరికి ప్రమోషన్ ఇవ్వాలి? వంటి విషయాలతో పాటు ఎన్‌ఎస్‌ఈ డివిడెంట్, ఆర్థిక ఫలితాల వివరాలు, బోర్డ్ మీటింగ్ ఎజెండా ఫైనాన్షియల్ డేటా మొత్తం ఆ గుర్తు తెలియని యోగి డైరెక్షన్‌లోనే జరిగాయి.
కలవకుండానే
ఆ యోగిని చిత్రా ఎప్పుడు కలవలేదు. మెయిల్ రూపంలోనే వారి మధ్య సంభాషణలు కొనసాగాయి. చిత్రా ప్రశ్నలు అడగడం దానికి యోగి సమాధానాలు చెప్పడం.. ఇలా అన్నీ ఆ యోగి డైరెక్షన్‌లోనే సాగాయి. చిత్రా రామకృష్ణ ఎన్‌ఎస్‌ఈకి 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.
Also Read: Punjab Assembly 2022: 'నెహ్రూపై నిందలు ఎందుకు? ఏడున్నరేళ్లలో మీరు చేసిందేంటి?'
Also Read: ITBP Viral Video: గస్తీ మే సవాల్! చైనా సరిహద్దుల్లో 15 వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ జవాన్ల పహారా