Senco Gold Listing:


సెంకో గోల్డ్‌ షేర్ల లిస్టింగ్‌ అదిరింది! శుక్రవారం ఈ కంపెనీ షేర్లు 35.96 శాతం ప్రీమియంతో స్టాక్‌ మార్కెట్లో నమోదు అయ్యాయి. విశ్లేషకులు అంచనాలను అందుకున్నాయి. కోల్‌కతా కేంద్రంగా ఈ కంపెనీ నగల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే.


పబ్లిక్‌ ఇష్యూకు భారీ స్పందన రావడం, తూర్పు భారత దేశంలో మంచి బ్రాండ్‌ నేమ్‌, పరిశ్రమలో ఐదు దశాబ్దాల అనుభవం, ఫైనాన్షియల్స్‌ బాగుండటం, ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు సెంకో గోల్డ్‌ (Senco Gold Listing) షేర్ల ర్యాలీకి ప్రధాన కారణాలు.


సెంకో గోల్డ్‌ (Senco Gold) షేర్లను రూ.317 ఇష్యూ చేయగా బీఎస్‌ఈలో రూ.431 వద్ద నమోదయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే గ్రే మార్కెట్లో 41 శాతం వరకు ప్రీమియం పలకడంతో లిస్టింగ్‌ భారీగా ఉంటుందని  విశ్లేషకులు ముందుగానే అంచనా వేశారు. 2021, మార్చిలో కల్యాణ్ జువెలర్స్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్లో నమోదైన రెండో కంపెనీ ఇదే కావడం గమనార్హం.


పబ్లిక్ ఇష్యూకు వస్తున్నట్టు ప్రకటించగానే ఇన్వెస్టర్ల నుంచి సెంకో గోల్డ్‌కు (Senco Gold IPO) భారీ స్పందన లభించింది. 73 రెట్లు బిడ్డింగ్‌ చేశారు. ఐడియా ఫోర్జ్‌ తర్వాత ఈ ఏడాది ఇంతలా సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న ఐపీవో ఇదే కావడం విశేషం. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు 181 రెట్లు దరఖాస్తు చేశారు. సంపన్నులు 65 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లు 15.5 రెట్లు ఐపీవోకు దరఖాస్తు చేసుకున్నారు. చాలా బ్రోకరేజీ కంపెనీలు సెంకో గోల్డ్‌కు స్కబ్‌స్క్రైబ్‌ రేటింగ్‌ ఇచ్చాయి.


సెంకో గోల్డ్‌కు 136 షోరూములు ఉన్నాయి. ఇందులో 75 వారి సొంతం. 61 ఫ్రాంచైజీలు ఉన్నాయి. బంగారం పరిశ్రమలో టీసీఎస్‌ పీఈ 83.5 రెట్లు, కల్యాణ్ జువెలర్స్‌ 35 రెట్లు ఉండగా రూ.2462 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన సెంకోకు మాత్రం 15.5 రెట్లే ఉంది. 2025 ఆర్థిక సంవత్సరానికి ఆపరేటింగ్‌ రెవెన్యూ 14.4 శాతం వృద్ధితో రూ.5334 కోట్లకు చేరుకుంటుందని అంచనా. పన్ను చెల్లించాక లాభం 17 నుంచి 26 బీపీఎస్‌కు పెరుగనుంది. ఇక 2021-23లో ఆపరేషన్స్‌ రెవెన్యూ 24 శాతం పెరిగి రూ.4,077 కోట్లుగా ఉంది. నికర లాభం 61 శాతం పెరిగి రూ.158.5 కోట్లకు చేరుకుంది.


ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సెంకో గోల్డ్‌ రూ.405 కోట్లు సమీకరించింది. వర్కింగ్  క్యాపిటల్‌ అవసరాల కోసం ఈ నిధులను వినియోగిస్తారు. అప్పులు, నగదు ప్రవాహం సవాళ్లు విసురుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 2023, మార్చి నాటికి కంపెనీకి రూ.1172 కోట్ల అప్పులు ఉన్నాయి. అంతకు ముందు ఏడాదిలోని రూ.863 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయి. గతేడాదిలోని రూ.70 కోట్లతో పోలిస్తే ఆపరేషన్స్‌ క్యాష్‌ ఫ్లో రూ.76 కోట్లకే పెరిగింది.


Also Read: లాభం, ఆదాయం రెండూ మిస్‌ మ్యాచింగ్‌ - విప్రో ప్రాఫిట్‌ ₹2,870 కోట్లు


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial