Oyo IPO: ఓయో(OYO) హోటల్స్ అండ్ హోమ్స్ మాతృ సంస్థ ఒరావల్ స్టే ఐపీవోను ప్రారంభించడం కోసం సెబీ(SEBI)కి సమర్పించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను ఉపసంహరించుకుంది. అంటే ఐపీఓను ప్రారంభించే ప్రణాళికలను కంపెనీ మరోసారి వాయిదా వేసుకుంది. కంపెనీ ఐపీఓ దరఖాస్తును ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి. అంతకుముందు 2021లో, ఓయో ఐపీవో (IPO) కోసం దరఖాస్తు చేసింది. కానీ, తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. ఓయో ఐపీఓపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు కంపెనీ ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుండి 4 బిలియన్ డాలర్ల విలువతో ఈక్విటీని సేకరించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

  


అయితే, కంపెనీ డ్రాఫ్ట్ పేపర్‌ను ఎందుకు ఉపసంహరించుకుందో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొనలేదు.  అయితే, కంపెనీ ఇప్పుడు రీఫైనాన్సింగ్ ద్వారా తన బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయాలనుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఓయో ప్రస్తుతం బాండ్ల ద్వారా 350 నుంచి 450 మిలియన్ డాలర్లు సేకరించాలనుకుంటోంది.
 
ఇది కంపెనీ ప్రణాళిక
రీఫైనాన్సింగ్ ఓయో  ఆర్థిక నివేదికలలో గణనీయమైన మార్పులకు దారితీస్తుందని బిజినెస్ స్టాండర్డ్‌లోని ఒక నివేదిక తెలిపింది. అందువల్ల, ప్రస్తుత నిబంధనల ప్రకారం రెగ్యులేటర్‌తో దాని ఫైలింగ్‌ను సవరించాల్సి ఉంటుంది.  రీఫైనాన్స్ నిర్ణయం అధునాతన దశలో ఉన్నందున, ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో ఐపీవో ఆమోదంతో కొనసాగించడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. బాండ్ జారీ చేసిన తర్వాత కంపెనీ ఆమోదం కోసం పత్రాలను మళ్లీ ఫైల్ చేస్తుంది.


2021 సంవత్సరంలో మొదటిసారి దరఖాస్తు  
ఓయో(OYO) 2021 సంవత్సరంలో మొదటిసారిగా సెబీ(SEBI)కి  12 బిలియన్ డాలర్ల విలువతో ఐపీవో(IPO)ని ప్రారంభించేందుకు పత్రాలను సమర్పించింది. కానీ, తర్వాత కంపెనీ మనసు మార్చుకుని పేపర్లను వెనక్కి తీసుకుంది. దీని తర్వాత, గత ఏడాది మార్చిలో ఐపిఓ తీసుకురావడానికి కంపెనీ రెండుసార్లు డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.  Oyo CEO రితేష్ అగర్వాల్ కంపెనీ  ఇటీవలి టౌన్‌హాల్ సమావేశంలో 3 నుండి 4 బిలియన్ డాలర్లను సేకరించడం గురించి మాట్లాడారు. రుణాన్ని తిరిగి చెల్లించడానికి కంపెనీ ఈ డబ్బును ఉపయోగించవచ్చు.