Netweb Technologies IPO: 


స్టాక్‌ మార్కెట్లో మరో టెక్నాలజీ కంపెనీ అరంగేట్రానికి సిద్ధమవుతోంది. సోమవారం నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ ఇండియా (Netweb Technologies) పబ్లిక్‌ ఇష్యూ మొదలైంది. తొలిరోజు ఈ ఐపీవోకు సాధారణ స్పందన లభించింది. మొత్తం 88.58 లక్షల షేర్లకు 23.77 లక్షల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఇప్పటి వరకు 27 శాతం వరకు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు.


మొత్తం ఐపీవో (Netweb Technologies IPO Size) పరిమాణంలో 35 శాతం ఈక్విటీ షేర్లు రిటైల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఇందులో 41 శాతానికి బిడ్లు లభించాయి. 20,000 ఈక్విటీ షేర్లను ఉద్యోగులకు కేటాయించగా 1.47 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. ఫైనల్‌ ప్రైజ్‌పై 25 రూపాయలు రాయితీ ఇస్తున్నారు. అధిక నెట్‌వర్త్‌ కలిగిన సంపన్నులకు 19.22 లక్షల షేర్లు కేటాయించగా 26 శాతం బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు ఇంకా బిడ్లు మొదలు పెట్టలేదు.


నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ మొదట 1.26 కోట్ల షేర్లతో ఐపీవోకు రావాలని భావించింది. జులై 14న క్యూఐబీ కోటాలో యాంకర్‌ బుక్‌ ద్వారా రూ.189 కోట్లు సమీకరించడంతో 88.58 లక్షల షేర్లకు పరిమాణాన్ని తగ్గించింది. ఈస్ట్‌స్ప్రింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఇండియా ఫండ్‌, నొమురా ఫండ్స్‌, యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఎంఎఫ్‌, గోల్డ్‌మన్‌ సాచెస్‌ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్ ట్రస్టీ, వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ మార్క్వీ ఇన్వెస్టర్లుగా ఉన్నారు.


కంపెనీ రూ.631 కోట్లతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ప్రెష్‌ ఇష్యూ ద్వారా రూ.206 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.425 కోట్లు సమీకరిస్తున్నారు. ధరల శ్రేణిని రూ.475-500గా నిర్ణయించారు. జులై 19న ఐపీవో ముగుస్తుంది. ఐపీవోకు ముందే ప్రీ ఐపీవో ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.51 కోట్లు సేకరించారు. 10.2 లక్షల షేర్లను రూ.500కు విక్రయించారు. ఎల్‌జీ ఫ్యామిలీ ట్రస్ట్‌, అనుపమ కిషోర్‌ పాటిల్‌, 360 వన్‌ స్పెషల్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌, 360 వన్‌ మోనోపొలిస్టిక్‌ మార్కెట్ ఇంటర్‌మీడియరీస్ ఫండ్‌ ఇందులో పాల్గొన్నాయి.


ఐపీవో ద్వారా సేకరించిన డబ్బును సర్ఫేస్‌ మౌంట్‌ టెక్నాలజీ (SMT) లైన్‌ డెవలప్‌మెంట్‌, లాంగ్‌టర్మ్‌ వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, అప్పులు చెల్లించడం, సాధారణ కార్పొరేట్‌ వ్యవహారాల కోసం ఉపయోగించనున్నారు. సూపర్‌ కంప్యూటింగ్‌ సిస్టమ్స్‌, ప్రైవేట్‌ క్లౌడ్‌, హైపర్‌ కన్వర్జుడ్‌ ఇన్ఫ్రా, డేటా సెంటర్‌ సర్వర్లు, ఏఐ సిస్టమ్స్‌, ఎంటర్‌ప్రైస్‌ వర్క్‌స్టేషన్స్‌, హెచ్‌పీఎస్‌ సొల్యూషన్స్‌ వంటి సేవలను నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ అందిస్తోంది. సూపర్‌ కంప్యూటింగ్‌, ప్రైవేట్‌ క్లౌడ్‌, హెచ్‌సీఐ ద్వారానే 70 శాతం వ్యాపారం జరుగుతోంది.


నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ 2023, మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో రూ.445 కోట్ల ఆదాయం నమోదు చేసింది. నికర లాభం రూ.46.9 కోట్లు. 2021-23 ఆర్థిక ఏడాదిలో సీఏజీఆర్‌ వృద్ధి 76.6 నుంచి 138 శాతానికి పెరిగింది. 2021లో ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.48.56 కోట్లు ఉండగా 2023కు రూ.90.2 కోట్లకు చేరుకుంది.


Also Read: రిస్క్‌ లేని ఇన్వెస్ట్‌మెంట్‌ + రెగ్యులర్‌ ఇన్‌కమ్‌ - ఈ స్కీమ్స్‌ ట్రై చేయొచ్చు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial