Global Surfaces IPO Share Allotment: 2023 మార్చి 13-15 తేదీల్లో జరిగిన గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీవోకు సంబంధించి, ఇవాళ (20 మార్చి 2023) షేర్ల కేటాయింపు జరగనుంది.
పబ్లిక్ ఆఫర్‌లో, రూ.133 - 140 మధ్య ధరలను ప్రైస్ బ్యాండ్‌గా (Global Surfaces IPO Price Band) కంపెనీ నిర్ణయించింది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ (రూ. 140) ప్రకారం, ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ. 155 కోట్లను గ్లోబల్ సర్ఫేసెస్ సమీకరించింది.
ఐపీవో ద్వారా 85.20 లక్షల షేర్లను ఫ్రెష్‌గా ఈ కంపెనీ ఇష్యూ చేసింది. కంపెనీ ప్రమోటర్లు మయాంక్ షా, శ్వేతా షా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్ ద్వారా 25.5 లక్షల షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు.
IPOలో బిడ్స్ వేసినవాళ్లకు లాటరీ పద్ధతిలో షేర్లను కేటాయిస్తారు. రిజిస్ట్రార్ ఈ తతంగాన్ని పర్యవేక్షిస్తారు.
ఒకవేళ మీరు కూడా ఈ ఐపీవోలో బిడ్ వేస్తే, లాటరీ తర్వాత ద్వారా మీకు ఎన్ని షేర్లు కేటాయించారో సమాచారం అందుతుంది. బిడ్డర్లు BSE ద్వారా లేదా రిజిస్ట్రార్ వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా షేర్ల కేటాయింపు స్థితిని (Share Allotment Status) తనిఖీ చేసుకోవచ్చు.
షేర్ల కేటాయింపు స్టేటస్‌ను BSEలో ఎలా తనిఖీ చేయాలి?
స్టెప్ 1: BSE వెబ్‌సైట్‌ని సందర్శించండి
స్టెప్ 2: ఇష్యూ పేరును ఎంచుకోండి. డ్రాప్-డౌన్‌లో ఈ కంపెనీ పేరు మీకు కనిపిస్తుంది
స్టెప్ 3: కేటాయింపు స్థితిని తనిఖీ చేయడానికి మీ అప్లికేషన్ నంబర్ లేదా పాన్ నంబర్‌ను నమోదు చేయండి.
స్టెప్ 4: షేర్లు కేటాయింపునకు సంబంధించిన సమాచారం స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది.
IPOలో, అర్హత గల సంస్థాగత పెట్టుబడిదార్లకు (qualified institutional buyers - QIBs) 50 శాతం కోటా రిజర్వ్ చేశారు. సంస్థాగతేతర పెట్టుబడిదార్లకు (non-institutional investors) 15 శాతం, చిన్న పెట్టుబడిదార్లకు (retail investors) 35 శాతం వాటాను ఖరారు చేశారు. ఐపీవోల్లో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సాధారణంగా 15 శాతం పోర్షన్ మాత్రమే కేటాయిస్తారు, ఈ ఐపీవోలో అంతకుమించి అవకాశం ఇచ్చారు.
మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్నప్పటికీ ఈ ఇష్యూ 12.21 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ భాగానికి 5.12 రెట్ల స్పందన వచ్చింది. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 33.10 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే.. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు 8.95 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
రెండు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో (BSE & NSE) మార్చి 23, 2023న గ్లోబల్ సర్ఫేసెస్ షేర్లు లిస్ట్ (Global Surfaces Shares Listing Date) అవుతాయని భావిస్తున్నారు. అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో షేర్లు కమాండ్ చేసిన ప్రీమియంను (గ్రే మార్కెట్ ప్రీమియం) బట్టి ఈ షేర్లు 10% ప్రీమియంతో లిస్ట్ అవుతాయని ఎనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.