Divgi TorqTransfer IPO: ఆటో కాంపోనెంట్స్ తయారీ కంపెనీ దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO), తొలిరోజున 12% సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఇష్యూ పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో బలమైన ఆసక్తి కనిపిస్తోంది. రిటైల్ పెట్టుబడిదార్ల కోసం రిజర్వు చేసిన భాగం ఇష్యూ మొదటి రోజున 60% సబ్‌స్క్రైబ్ అయింది.
అర్హత గల సంస్థాగత కొనుగోలుదార్ల (QIBలు) కోసం ఈ ఆఫర్‌లో 75% , సంస్థాగతేతర పెట్టుబడిదాపర్లకు 15%, రిటైల్ పెట్టుబడిదార్ల కోసం మిగిలిన 10% రిజర్వ్ చేశారు.
నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NIIలు) కోసం రిజర్వ్ చేయబడిన బిట్‌లో 6% బిడ్‌లు వచ్చాయి. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదార్లకు (QIBలు) కేటాయించిన భాగంలో కేవలం 700 షేర్లకే బిడ్ వేశారు.
మార్చి 1, 2023న ప్రారంభమైన దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ IPO, మార్చి 3వ తేదీ వరకు ఓపెన్‌లో ఉంటుంది.
ప్రస్తుతం రూ.65 ప్రీమియం
IPO ప్రైస్ బ్యాండ్‌ను రూ. 560-590 గా దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ నిర్ణయించింది. అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో (గ్రే మార్కెట్) ఒక్కో షేరుకు ప్రస్తుతం రూ. 65 ప్రీమియం నడుస్తోంది. అప్పర్ ప్రైస్ బ్యాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే, 11% లిస్టింగ్ గెయిన్స్‌ను ఈ ప్రీమియం సూచిస్తోంది.
IPO ప్రైస్ బ్యాండ్ అప్పర్ ఎండ్ ప్రకారం ఈ కంపెనీ రూ. 412 కోట్లు సేకరిస్తుందని అంచనా. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేకపోతే, ఈ షేర్లు మార్చి 14న ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి.
పుణె కేంద్రంగా దివ్‌గీ టార్క్‌ట్రాన్స్‌ఫర్ సిస్టమ్స్ పని చేస్తుంది. భారతదేశంలోని ప్రముఖ OEMలకు ట్రాన్స్‌ఫర్ కేస్ సిస్టమ్స్, టార్క్ కప్లర్‌లను సరఫరా చేస్తోంది.
ఈ పబ్లిక్ ఆఫర్ డీసెంట్ వాల్యూతో ఉందని చెప్పిన చాలా మంది ఎనలిస్ట్‌లు, ఇష్యూను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చని సిఫార్సు చేశారు. దేశంలో టార్క్ కప్లర్‌లను తయారు చేస్తున్న ఏకైక సంస్థ ఇదని చెప్పారు. దీర్ఘకాలిక పెట్టుబడి దృష్టితో IPOలో బిడ్స్ వేయాలని సూచించారు.
కంపెనీ ఆర్థిక పరిస్థితి
సెప్టెంబర్ 2022 నాటికి ఈ కంపెనీ రూ. 26 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది, అదే సమయంలో మొత్తం ఆదాయం రూ. 137 కోట్లుగా ఉంది. FY20 - FY22 మధ్య, కంపెనీ పన్ను తర్వాతి లాభం 28.30% CAGR వద్ద పెరిగింది.
FY22 వరకు ఉన్న కంపెనీ ఆర్థిక స్థితిగతులపై చాలా బ్రోకరేజీలు సంతృప్తి వ్యక్తం చేశాయి.
ఈ ఇష్యూని "సబ్‌స్ర్కైబ్" చేసుకోవచ్చని కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్, ICICI డైరెక్ట్, నిర్మల్ బ్యాంగ్ సిఫార్సు చేశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.