International Womens Day 2024 Special: సర్వశక్తికి, సహనానికి చిహ్నం మహిళలు. ఇంటిని మాత్రమే కాదు.. వ్యాపారాలను చక్కబెట్టడంలో, పరిశ్రమలను నడిపించడంలో పురుషుల కంటే ఒక మెట్టు పైనే ఉంటున్నారు. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం, భారత్‌లోని మొత్తం పారిశ్రామికవేత్తల్లో మహిళల వాటా 14%. స్టార్టప్‌ల డైరెక్టర్లలో 35% మంది స్త్రీలే. పెరుగుతున్న మహిళా పారిశ్రామికవేత్తలతో మారుతున్న భారతీయ వ్యవస్థాపకత ముఖచిత్రానికి ఈ సంఖ్యలే నిదర్శనం. ఈ నంబర్లు ఏటికేడు మెరుగుపడుతున్నాయి.


ఈ రోజు, మహిళా వ్యవస్థాపకులు వేల కోట్ల వ్యాపారాలను అలవోకగా చక్కబెడుతున్నారు, పురుషులకు సవాల్‌ విసురుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. భారతదేశంలో విజయవంతమైన 10 మంది మహిళా పారిశ్రామికవేత్తలు వీళ్లే..


1) కిరణ్ మజుందార్ షా
‍కంపెనీ: బయోకాన్ లిమిటెడ్ (Biocon Ltd)


ప్రముఖ బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలైన కిరణ్ మజుందార్ షా, మన దేశంలోని అత్యంత ప్రసిద్ధ మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరు. భారతదేశంలో బయోటెక్నాలజీ పేరు పెద్దగా వినిపించని రోజుల్లోనే ఆమె ఈ రంగంలోకి ప్రవేశించారు.


2) ఫల్గుణి నాయర్
‍కంపెనీ: నైకా (Nykaa)


ఫాల్గుణి నాయర్, 4 బిలియన్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో 44వ ర్యాంక్‌ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు, ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచారు. అడుగుపెట్టడంతో ఆమె చర్చనీయాంశమైంది. మహిళల కోసం.. అందం, ఫ్యాషన్, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులు అమ్మే నైకా బ్రాండ్‌ను 2012లో ప్రారంభించి, అందరి దృష్టిని ఆకర్షించారు. భారతదేశపు అతి పెద్ద ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అది.


3) శ్రద్ధ శర్మ
‍కంపెనీ: యువర్‌స్టోరీ మీడియా (YourStory Media)


‍CNBC TV18 జర్నలిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన శ్రద్ధ శర్మ, 'యువర్‌స్టోరీ' పేరిట మీడియా సంస్థను స్థాపించి దేశంలో పాపులర్‌ అయ్యారు. బెంగళూరలో స్టార్టప్‌గా ప్రారంభమైన ఈ కంపెనీకి ప్రారంభ పెట్టుబడి కేవలం ₹2 లక్షలు. ఆ రతన్ టాటా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీ, కలారీ క్యాపిటల్, క్వాల్‌కామ్ వెంచర్స్, 3one4 క్యాపిటల్, టీవీ మోహన్‌దాస్ పాయ్ వంటి దిగ్గజాలు ఈ కంపెనీలో పెట్టుబడులుపెట్టారు.


4) ఉపాసన టకు
‍కంపెనీ: మొబిక్విక్‌ (MobiKwik)



సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ & ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేశారు. పేమెంట్స్‌ విధానాన్ని వినూత్నం మార్చడంలో మొబైల్ టెక్నాలజీ సామర్థ్యాన్ని పసిగట్టారు. తన సహ వ్యవస్థాపకుడు, బిపిన్ ప్రీత్ సింగ్‌తో కలిసి 2009లో మొబిక్విక్‌ స్థాపించారు. దీని ద్వారా కోట్లాది మంది భారతీయులకు ఆర్థిక లావాదేవీలను సరళీకృతం & డిజిటలైజ్ చేశారు. ఆమె నాయకత్వంలో మొబిక్విక్‌ పరుగులు పెట్టింది, సురక్షితమైన & అనుకూలమైన డిజిటల్ చెల్లింపులకు మారుపేరుగా మారింది.


5) స్నేహ చౌదరి
‍కంపెనీ: జోలో (Zolo)


దేశంలోని విద్యార్థులు, నిపుణుల కోసం తక్కువ ధరలో, నాణ్యమైన, సురక్షితమైన వసతి కల్పించడంలో అవకాశాలను స్నేహ చౌదరి గుర్తించారు. తన వ్యాపార భాగస్వాములు నిఖిల్ సిక్రి, అఖిల్ సిక్రితో కలిసి జోలోస్టే ప్రారంభించారు. దీని ద్వారా.. భరించగలిగే ధరల్లో, మంచి అకామడేషన్‌ ఆప్షన్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు.


6) దివ్య గోకుల్‌నాథ్
‍కంపెనీ: బైజూస్‌ (BYJU'S)


భర్త బైజు రవీంద్రన్‌తో కలిసి ప్రముఖ ఎడ్-టెక్ కంపెనీ బైజూస్‌ను స్థాపించారు, దాని అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు. భారతదేశంలోని అత్యంత ధనిక మహిళా పారిశ్రామికవేత్తల్లో ఒకరుగా మారారు. ఆన్‌లైన్‌ ద్వారా నాణ్యమైన విద్యను అందుకోగలిగే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు.


7) రిచా కర్
‍కంపెనీ: జివామే (Zivame)


‍బిట్స్ పిలానీ నుంచి ఇంజినీరింగ్‌ పట్టా పొందిన రిచా కర్‌, లోదుస్తుల బ్రాండ్ అయిన జివామ్‌ను స్థాపించారు. ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్‌ ద్వారా విక్రయాలు చేస్తూ భారతదేశపు అత్యంత ధనిక మహిళా పారిశ్రామికవేత్తల లిస్ట్‌లోకి ఎక్కారు. రిచా 2011లో ఈ బ్రాండ్‌ను స్థాపించారు. ఇప్పుడు దేశంలోని 30కి పైగా ప్రదేశాల్లో బ్రాండ్‌ స్టోర్లు ఉన్నాయి.


8) వందన లూథ్రా
‍కంపెనీ: వీఎల్‌సీసీ (VLCC)


‍వందన వ్యాపార ప్రయాణం 1980ల్లో ప్రారంభమైంది. న్యూదిల్లీలో మొదటి VLCC స్టోర్‌ను ప్రారంభించారు, భారతదేశపు తొలితరం మహిళా భారతీయ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా నిలిచారు. దిల్లీ నుంచి తన వ్యాపారాన్ని సమర్థవంతంగా దేశవ్యాప్తంగా విస్తరించారు. ఇప్పుడు.. అన్ని ప్రపంచంలోని అన్ని దేశాల్లో VLCC ఉత్పత్తులకు భారీ ఫాలోయింగ్‌ ఉంది.


9) స్వాతి భార్గవ
‍కంపెనీ: క్యాష్‌కరో (CashKaro)


‍క్యాష్‌కరో సహ వ్యవస్థాపకురాలు స్వాతి భార్గవ, దేశంలోని ఇ-కామర్స్ & క్యాష్‌బ్యాక్ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యక్తిగా మారారు. తన హనీమూన్ టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు ఒక క్యాష్‌బ్యాక్ వెబ్‌సైట్ ద్వారా డబ్బు ఆదా చేసిన స్వాతి, ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకున్నారు. తన భర్తతో కలిసి 2013లో క్యాష్‌కరో ప్రారంభించారు. మహిళలు, పురుషులు సమానంగా డబ్బు ఆదా చేసే చిట్కాల్లో ఒకటిగా ఇది నిలిచింది, పొదుపులను పెంచింది.


10) రాధిక ఘాయ్‌ అగర్వాల్
‍కంపెనీ: షాప్‌క్లూస్‌ (ShopClues)


ఏకకాలంలో ఎక్కువ వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న విజయవంతమైన మహిళా వ్యాపారవేత్త ‍రాధికా ఘాయ్. దేశంలోని టాప్ 10 మహిళా పారిశ్రామికవేత్తల్లో ఒకరీమె. రాధిక ప్రారంభించిన షాప్‌క్లూస్‌ దేశంలోని మూలమూలకు చొచ్చుకుపోయింది. ప్రస్తుతం 1.1 బిలియన్‌ డాలర్ల విలువైన ఈ కంపెనీ, దేశంలో అత్యంత విజయవంతమైన స్వదేశీ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌ల్లో ఒకటి.


మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ రేట్లు మండుతున్నాయ్‌గా - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే