RBI Inflation Projection: 2023-24 ఆర్థిక సంవత్సరానికి (FY24) సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC Meeting) ఐదో సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. ఆర్‌బీఐ తన రెపో రేటులో (repo rate) ఎలాంటి మార్పు చేయలేదు. 6.50 శాతం వద్దే కొనసాగించింది. రెపో రేటులో మార్పు ఉండదన్న విషయాన్ని మొదటి నుంచి ఊహిస్తున్నదే కాబట్టి, ఈ నిర్ణయం మార్కెట్‌ను ఆశ్చర్యపరచలేదు.


అయితే, రెపో రేటును స్థిరంగా ఉంచితే బ్యాంక్‌ వడ్డీ రేట్లు (bank interest rates) పెరిగే ఛాన్స్‌ ఉండదు. కాబట్టి, రుణం తీసుకున్న/తీసుకోబోయే ప్రజల మీద అదనపు EMI భారం పడదు. వడ్డీ రేట్లు తగ్గుతాయి, EMIల మొత్తం తగ్గుతుందని ఆశ పడినవారికి ఇది పెద్ద ఎదురు దెబ్బ.          


FY24లో ద్రవ్యోల్బణం అంచనా 
రెపో రేటును ప్రకటిస్తూనే, FY24లో ద్రవ్యోల్బణం అంచనాలను కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governor Shaktikanta Das) వెల్లడించారు. మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (CPI Inflation) 5.40 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. అంతకు ముందు, ఈ ఏడాది ఆగస్టులో, RBI తన ద్రవ్యోల్బణ రేటు అంచనాను 5.1 శాతం నుంచి 5.40 శాతానికి పెంచింది. తాజా, కూడా అదే అంచనాను (5.40%) కొనసాగించింది.


మరో ఆసక్తికర కథనం: మళ్లీ రూ.64,000 వైపు పసిడి పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి 


FY24 కోసం ద్రవ్యోల్బణం అంచనాను మార్చకపోవడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. ఎందుకంటే, ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ఆహార ధరల్లో జంప్‌ కారణంగానే పాత లెక్కనే ఈసారి కూడా అప్పజెప్పింది కేంద్ర బ్యాంక్‌. ఆహార పదార్థాల ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు, సామాన్యుడిపై ధరాభారం కొనసాగుతుందన్నది దీని అర్ధం. ఇంత పెద్ద విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ చాలా కూల్‌గా చెప్పారు.


డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం - ఆర్‌బీఐ గవర్నర్
రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానాల్లో మార్పుల ప్రభావం మొత్తం ద్రవ్యోల్బణం గణాంకాలపై స్పష్టంగా కనిపిస్తోందని, అయితే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదలకు సరఫరా గొలుసు వంటి చాలా ఇతర కారణాలు ఉన్నాయని దాస్ చెప్పారు. ఆహార పదార్థాల ధరల పెరుగుదల ప్రభావం నవంబర్ నెల ద్రవ్యోల్బణంలో స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా డిసెంబర్‌ నంబర్‌లోనూ ఆ ప్రభావం గట్టిగానే ఉండవచ్చు.           


FY25లో ద్రవ్యోల్బణం అంచనాలు అంచనా
2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ‍(2023 అక్టోబర్‌-డిసెంబర్‌ కాలం)‌ ద్రవ్యోల్బణం రేటు 5.6 శాతంగా, నాలుగో త్రైమాసికంలో (2024 జనవరి-మార్చి కాలం) 5.20 శాతంగా సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (FY25), ద్రవ్యోల్బణం మొదటి త్రైమాసికంలో 5.20 శాతం, రెండో త్రైమాసికంలో 4 శాతం, మూడో త్రైమాసికంలో 4.70 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ లెక్కగట్టింది.           


మరో ఆసక్తికర కథనం: ఈఎంఐల భారం నుంచి ఈసారి కూడా ఉపశమనం లేదు - రెపో రేట్‌ యథాతథం