Asia Stock Markets Raise Today: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), చివరిన నిమిషంలో శాంతించారు. ఏప్రిల్ 09, 2025 నుంచి అమలు కావాలసిన అధిక సుంకాల రేట్లపై (Trump Tariffs) 90 రోజుల విరామం ప్రకటించారు. దీంతో, బుధవారం‍ (09 ఏప్రిల్‌ 2025) యూఎస్‌ స్టాక్ మార్కెట్లు (US stock Markets) రాకెట్లను తలపించేలా దూసుకెళ్లాయి. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో, US స్టాక్ మార్కెట్ ఒక్క రోజులో అతి భారీ లాభాలను చూసింది. అయితే, ట్రంప్‌ చైనాను మాత్రం ఒదిలిపెట్టలేదు, చైనీస్ వస్తువులపై సుంకాలను 104% నుంచి 125%కి పెంచుతున్నట్లు ప్రకటించారు.    

అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లలో.. S&P 500 ఇండెక్స్‌ 9.5% హైయ్యర్‌ సైడ్‌లో ముగియగా, నాస్‌డాక్ 12% పెరిగి 100 పాయింట్లు లాభపడింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ దాదాపు 7.9% పెరిగింది. ఒక రోజులో దాదాపు 30 బిలియన్ షేర్లు ట్రేడ్ అయ్యాయి. ఇది, యూఎస్‌ మార్కెట్‌లో ఒక్క రోజులో ట్రేడయిన షేర్ల రికార్డ్‌ నంబర్‌.       

సుంకాలపై 90 రోజుల పాటు విరామం ఇస్తున్నానని, ఇప్పుడు 10% బేస్‌లైన్‌ టారిఫ్‌ మాత్రమే అమల్లో ఉంటుందని డొనాల్డ్‌ ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించారు. అయితే, ఈ విరామం చైనాకు వర్తించదని స్పష్టం చేశారు. వైట్ హౌస్, చైనాపై విధించిన సుంకాన్ని 125% పెంచింది. చైనా ఇప్పటికే అమెరికన్ వస్తువులపై  84% సుంకం విధించింది. 

S&P 500 భారీ హై జంప్‌90 రోజుల విరామం ప్రకటనతో, బుధవారం నాడు ఒక దశలో S&P ఇండెక్స్ దాదాపు 11% పెరిగింది, ఇది నవంబర్ 2008 ప్రపంచ సంక్షోభం తర్వాత అతి పెద్ద జంప్. 2010లో సంభవించిన ఫ్లాష్ క్రాష్ కంటే కూడా ఇది పెద్ద పెరుగుదల. యూఎస్‌ మార్కెట్‌లో.. గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ షేర్లు దాదాపు 17.34% భారీ లాభాన్ని చవిచూశాయి, ఇది S&P రికార్డు లాభం కంటే కూడా ఎక్కువ. టెస్లా షేర్లు 19.83%, ఎన్‌విడియా 16.46%, ఆపిల్: 9.38%, మెటా 12.66%, అమెజాన్ 10.24%, మైక్రోసాఫ్ట్ 8.47%, గూగుల్ 7.83% చొప్పున ర్యాలీ చేశాయి.  

ఆసియా మార్కెట్లుయూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు రికార్డ్‌ స్థాయిలో పెరగడంతో, ఆ ప్రభావంతో ఆసియా మార్కెట్లు (Asia stock Markets) కూడా ఈ రోజు (గురువారం, 10 ఏప్రిల్‌ 2025) జోరు చూపిస్తున్నాయి. ఈ రోజు ట్రేడింగ్‌లో.. జపాన్‌కు చెందిన నిక్కీ 8 శాతం పైగా లాభపడింది. ఆస్ట్రేలియాకు చెందిన ASX ఇండెక్స్‌ 4.7 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 4.9 శాతం, హాంకాంగ్‌లోని హాంగ్‌సెంగ్‌ ఇండెక్స్‌ 2.8 శాతం, తైవాన్‌ ఇండెక్స్‌ 9.2 శాతం చొప్పున రాణించాయి. షాంఘై ఇండెక్స్‌ మాత్రం స్వల్పంగా 0.6 శాతం మేర పుంజుకుంది. 

భారతీయ మార్కెట్లుమహవీర్‌ జయంతి సందర్భంగా ఈ రోజు (గురువారం) మన స్టాక్‌ మార్కెట్లకు హాలిడే.

కార్పొరేట్‌ ఫలితాల సీజన్‌ ప్రారంభం కానున్న తరుణంలో ట్రంప్‌ సుంకాలపై 90 రోజుల విరామం మార్కెట్‌కు శుభసూచకమని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.