Hanuman Vijayotsavam 2025: ఏటా చైత్రమాసం వచ్చేసరికి హనుమాన్ జయంతి సందరి ప్రారంభమవుతుంది. చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి అనే ప్రచారం ప్రారంభమవుతుంది. మరికొందరు వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి జరుపుకుంటారు?

హనుమాన్ జయంతి ఎప్పుడు.. చైత్రమాసంలోనా వైశాఖ మాసంలోనా?

చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవం

వైశాఖ పౌర్ణమి హనుమాన్ జయంతి

ఈ రెండింటి మధ్యా వ్యత్యాసం ఏంటి?

హనుమాన్ జయంతి ఎప్పుడు జరుపుకోవాలి అనేవిషయంపై స్పష్టంగా పురాణాల్లో ఏముంది?

2025లో...హనుమాన్ విజయోత్సవం - 2025 ఏప్రిల్ 12 శనివారంహనుమాన్ జయంతి - 2205 మే 22 గురువారం 

శ్లోకంవైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే || 

వైశాఖ మాస బహుళ దశమి రోజు పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించాడు హనుమంతుడు. ఈ రోజే హనుమాన్ జయంతి జరుపుకోవాలి. అంజనాదేవి కేసరుల  కుమారుడైన ఆంజనేయుడు రాక్షస సంహారార్థం రామకార్య నిర్వాహణకోసం జన్మించాడు. పుంజికస్థల అనే అప్సరస అంజనాదేవిగా జన్మించింది.. శివుని అష్టముర్తి అయిన వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలో చేరి హనుమంతుడు అవతరించాడు. 

హనుమాన్ కథకు ప్రామాణిక గ్రంథం పరాశర సంహిత ...ఈ గ్రంధం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రం ,  మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నం..కౌండిన్యస గోత్రంలో జన్మించాడు. అందుకే ఎలాంటి సందేహాలకు తావులేకుండా వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకోవాలి

మరి చైత్రమాసంలో వచ్చేది హనుమాన్ జయంతి కాదా?

చైత్ర పౌర్ణమి రోజు జరుపుకునేది హనుమాన్ విజయోత్సవం. కానీ ఈ రోజునే హనుమాన్ జయంతి అనేస్తున్నారు. హనుమంతుని సహాయంతో రాముడు సీత జాడ వెతుకుతాడు. వారధి నిర్మించి లంకకు తీసుకెళ్తాడు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. ఇలా తిరిగి రాముడు అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడు అయ్యేవరకూ ప్రతి అడుగులోనూ హనుమంతుడు ఉన్నాడు. అందుకే తన పట్టాభిషేకం ముగిసిన తర్వాత రాముడు ఇలా అనుకున్నాడట...

'హనుమంతుని అమోఘమైన సేవ కారణంగా సీతాదేవి తిరిగి వచ్చింది, నేను అయోధ్యకు చేరుకున్నాను, పట్టాభిషిక్తుడిని అయ్యాను , రాజ్యంలో ప్రజలు ఈ రోజు సంతోషంగా ఉన్నారంటే ఈ ఆనందం మొత్తం ఆంజనేయుడి వల్లే సాధ్యమైంది'  

ఈ భావనతోనే సంతోషంగా హనుమాన్ ని ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు రాముడు. ఈ సందర్భానికి గుర్తుగా అయోధ్య వాసులంతా శ్రీరామనవమి వేడుక, పట్టాభిషేకం ముగిసిన తర్వాత వచ్చిన చైత్ర మాస పౌర్ణమి రోజుని హనుమాన్ విజయోత్సవంగా జరుపుకుంటున్నారు. అదే కాలక్రమేణా హనుమాన్ జయంతిగా మారిపోయింది. ఉత్తరాది రాష్ట్రాలు సహా తెలంగాణలోనూ హనుమాన్ విజయోత్సవాన్ని జయంతిగానే జరుపుకుంటారు.  ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో వైశాఖమాసంలో ఆంజనేయుడు జన్మతిథి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. 

యత్ర యత్ర రఘునాధ కీర్తనంతత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్బాష్పవారి పరిపూర్ణలోచనంమారుతిం నమత రాక్షసాంతకమ్

శ్రీరాముని కీర్తన జరిగే ప్రతిచోటా హనుమంతుడు అంజలి ఘటించి నిలబడి ఉంటాడు. రాక్షసాంతకుడైన అలాంటి హనుమాన్ కి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో  మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి